తెలంగాణ

telangana

ETV Bharat / sports

National sports awards: నీరజ్​కు 'ఖేల్​రత్న'.. ధావన్​కు 'అర్జున'

రాష్ట్రపతి భవన్​లో జాతీయ క్రీడా పురస్కార (National Sports Awards 2021) ప్రదాన వేడుక ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో 12 మంది అథ్లెట్లకు రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్.. ఖేల్​రత్న (Major Dhyan Chand Khel Ratna Award) అవార్డును అందజేశారు.

National Sports Awards
Khel Ratna Award

By

Published : Nov 13, 2021, 4:41 PM IST

Updated : Nov 13, 2021, 5:21 PM IST

2021 సంవత్సరానికి గానూ జాతీయ క్రీడా అవార్డుల (National Sports Awards 2021) విజేతలకు పురస్కారాలు స్వయంగా బహుకరించారు రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్ (Ram Nath Kovind News). కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

మన్​ప్రీత్ సింగ్

ఈ కార్యక్రంలో మొత్తం 12 మంది క్రీడాకారులకు మేజర్ ధ్యాన్​చంద్ ఖేల్​రత్న (Khel Ratna Award 2021) ప్రదానం చేశారు రాష్ట్రపతి. వీరిలో టోక్యో ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్ నీరజ్ చోప్డా(అథ్లెటిక్స్), మన్​ప్రీత్ సింగ్, శ్రీజేశ్ (హాకీ), రవి కుమార్(రెజ్లింగ్), లవ్లీనా బోర్గోహైన్(బాక్సింగ్) ఉన్నారు.

మిథాలీ రాజ్
సునీల్ ఛెత్రి

పారాలింపిక్స్ అథ్లెట్లు అవనీ లేఖరా, సుమిత్ అంతిల్, ప్రమోద్ భగత్, కృష్ణ నాగర్, మనీష్ నర్వాల్, మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్, ఫుట్​బాలర్ సునీల్ ఛెత్రి.. కూడా ఈ ఏడాది ఖేల్​రత్న అవార్డు అందుకున్నారు.

అర్జున అవార్డు గ్రహీతలు

నిషద్ కుమార్ (హైజంప్), ప్రవీణ్ కుమార్ (హైజంప్), శరద్ కుమార్ (హైజంప్), యోగేష్ కథునియా (డిస్కస్ త్రో), సుహాస్ ఎల్​వై (బ్యాడ్మింటన్), సింగ్‌రాజ్ అధానా (షూటింగ్), భవినా పటేల్ (టేబుల్ టెన్నిస్), హర్విందర్ సింగ్ (ఆర్చరీ), శిఖర్ ధావన్ (క్రికెట్) సహా శ్రీజేశ్, మన్​ప్రీత్​ మినహా హాకీ ఇండియా పురుషుల జట్టుకు అర్జున అవార్డు (Arjuna Award 2021) ప్రదానం చేశారు.

గతేడాదివి కూడా ఈ నెల్లోనే..

2020 సంవత్సరానికి గాను జాతీయ క్రీడా అవార్డుల (2020 National Sports Awards) విజేతలకు నవంబర్​ 1నే ట్రోఫీలను స్వయంగా బహుకరించారు కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్. కరోనా కారణంగా గతేడాది ఈ అవార్డుల ప్రదానోత్సవం వర్చువల్​గా జరిగింది.

విజేతలందరికీ ఇదివరకే నగదు బహుమానం అందింది. కానీ, మహమ్మారి కారణంగా ట్రోఫీలు, ప్రశంసాపత్రాలను అందుకోలేకపోయారు. గతేడాది ఆగస్టు 29న 5 ఖేల్​రత్న సహా 74 జాతీయ క్రీడా అవార్డులను (Sports Awards In India 2020) ప్రదానం చేసింది క్రీడల శాఖ.ఈ కార్యక్రమానికి హాజరైనవారిలో మహిళల హాకీ జట్టు కెప్టెన్ రాణీ రాంపాల్, స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగట్, 2016 పారాలింపిక్స్​ పసిడి విజేత తంగవేలు మరియప్పన్ ఉన్నారు. వారికి ఖేల్​రత్న (Khel Ratna Award 2020) లభించింది.టోక్యో ఒలింపిక్స్​ కాంస్య పతక విజేత లవ్లీనా, క్రికెటర్ ఇషాంత్ శర్మ, స్ప్రింటర్ ద్యుతి చంద్, ఆర్చర్ అతాను దాస్, షట్లర్లు సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి అర్జున (Arjuna Award 2020) ట్రోఫీలను అందుకున్నారు.

ఇవీ చూడండి:

కేంద్రమంత్రికి పీవీ సింధు పాఠాలు..!

Harbhajan singh news: ఆ గౌరవం దక్కడంపై హర్భజన్​ ఆనందం

FIH Awards 2021: హాకీ అవార్డుల్లో భారత్‌ ఆధిపత్యం

Last Updated : Nov 13, 2021, 5:21 PM IST

ABOUT THE AUTHOR

...view details