తెలంగాణ

telangana

ETV Bharat / sports

బాస్కెట్​బాల్​ పోటీల కోసం 'గేట్​ వే ఆఫ్​ ఇండియా' అలంకరణ - గేట్​ వే ఆఫ్​ ఇండియా

ప్రతిష్టాత్మక బాస్కెట్​బాల్​ పోటీల కోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది కేంద్ర క్రీడామంత్రిత్వ శాఖ. తొలిసారి ఈ పోటీలను భారత్​లో నిర్వహిస్తుండటం వల్ల ముంబయిలోని 'గేట్​ వే ఆఫ్​ ఇండియా'కు మిరుమిట్లు గొలిపే దీపాలతో అలరించింది.

బాస్కెట్​బాల్​ పోటీల కోసం ఇండియా గేట్​ అలంకరణ

By

Published : Sep 29, 2019, 9:27 AM IST

Updated : Oct 2, 2019, 10:20 AM IST

బాస్కెట్​బాల్​ పోటీల కోసం 'గేట్​ వే ఆఫ్​ ఇండియా' అలంకరణ

క్రీడల్లో మరో చారిత్రక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది భారత క్రీడా మంత్రిత్వ శాఖ. తొలిసారి ముంబయి వేదికగా బాస్కెట్​బాల్​ పోటీలను నిర్వహించనుంది. దీనికోసం భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఆటను ప్రజల్లోకి తీసుకెళ్లి మరింత ఆసక్తి పెంచడం కోసం ముంబయిలోని 'గేట్​ వే ఆఫ్​ ఇండియా'ను మిరుమిట్లు గొలిపే దీపాలతో అలంకరిచింది.

భారత్​లో ఈ లీగ్​ ప్రవేశపెట్టడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు ఎన్​బీఏ(నేషనల్​ బాస్కెట్​బాల్​ అసోసియేషన్​) అధికారులు. భారత దేశ సంస్కృతి, సంప్రదాయాలను చూసేందుకు ఆసక్తిగా ఉన్నట్లు తెలిపారు.

వెలుగు జిలుగుల్లో గేట్​ వే ఆఫ్​ ఇండియా

ఈ పోటీల్లో అమెరికాకు చెందిన సాక్రామెంటో కింగ్స్​, ఇండియానా పేసర్స్​ జట్లు పోటీ పడుతున్నాయి. తొలిసారి ఈ బాస్కెట్​బాల్​ క్రీడను భారత్​లో నిర్వహిస్తుండటంపై హ్యూస్టన్​ సమావేశంలో ప్రశంసలు కురిపించారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్​. రెండు దేశాల మధ్య స్నేహానికి ఇదొక ఉదాహరణ అని చెప్పారు. ఆయన కూడా ఆటలను ప్రత్యక్షంగా చూడాలనుకుంటున్నట్లు తన ఆసక్తిని వెల్లడించారు. ముంబయిలోని ఎస్వీపీ స్టేడియంలో అక్టోబర్​ 4, 5 తేదీల్లో ఈ మ్యాచ్​లు జరగనున్నాయి.

ఇవీ చూడండి...

Last Updated : Oct 2, 2019, 10:20 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details