ఐదు పదుల వయసులోనూ బాక్సింగ్ రింగ్‌లో మళ్లీ అడుగుపెట్టనున్నాడు దిగ్గజ బాక్సర్ మైక్ టైసన్. సెప్టెంబరు 12న జరగబోయే ఎగ్జిబిషన్ బౌట్లో రాయ్ జోన్స్ జూనియర్‌తో తలపడనున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా ట్విట్టర్లో వెల్లడించాడు. వీరిద్దరి మధ్య బౌట్ ఉన్నట్లు కాలిఫోర్నియా స్టేట్ అథ్లెటిక్ కమీషన్ ధ్రువీకరించింది.
బాక్సర్ మైక్ టైసన్ రీఎంట్రీ.. 15 ఏళ్ల తర్వాత రింగ్‌లో - సెప్టెంబరు 12న టైసన్, జోన్స్
సుప్రసిద్ధ బాక్సర్ మైక్ టైసన్.. దాదాపు 15 ఏళ్ల తర్వాత బాక్సింగ్ రింగ్‌లోకి రీఎంట్రీ ఇస్తున్నాడు. సెప్టెంబరు 12న రాయ్ జోన్స్ జూనియర్‌తో ఎగ్జిబిషన్ మ్యాచ్‌లో తలపడనున్నాడు.
లాస్ ఏంజిల్స్‌లోని డిగ్నిటీ హెల్త్ స్పోర్ట్స్ పార్క్‌లో జరిగే ఈ పోరును పే-పర్-వ్యూతో పాటు ట్రిల్లర్ డిజిటల్ వేదికల్లో ప్రసారం చేయనున్నారు. అయితే తాను తిరిగి రింగ్‌లో అడుగుపెడుతున్నట్లు మే 12న చేసిన ట్వీట్లో హింట్ ఇచ్చాడు టైసన్. ప్రపంచ హెవీ వెయిట్ మాజీ ఛాంపియన్ అయిన ఇతడు.. ఇటీవలే ప్రాక్టీస్ చేస్తున్న వీడియోను ట్వీట్ చేశాడు.
రిటైర్మెంట్ ప్రకటించకముందు తలపడ్డ 58 మ్యాచ్‌ల్లో 50 గెలిచాడు మైక్ టైసన్. 2005లో కెవిన్ మెక్‌బ్రైడ్ చేతిలో ఓడిన తర్వాత కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. అయితే టైసన్, జోన్స్.. ఇద్దరూ 40 ఏళ్లు పైబడిన వ్యక్తుల కావడం వల్ల సీఎస్ఐసీ నిబంధనల ప్రకారం వైద్య పరీక్షలు చేయించుకోవడం సహా కరోనా నియంత్రణకు తగిన జాగ్రత్తలు పాటించాలి.