తెలంగాణ

telangana

ETV Bharat / sports

'2020 ఒలింపిక్స్​ తర్వాత వైదొలగుతా' - olympics

2020 టోక్యో ఒలింపిక్స్​ తర్వాత రిటైర్మెంట్ ప్రకటిస్తానని భారత స్టార్ బాక్సర్​ మేరీకోమ్ తెలిపింది. విశ్వక్రీడల్లో సత్తాచాటి స్వర్ణం నెగ్గుతానని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది.

మేరీ కోమ్

By

Published : Jun 6, 2019, 10:30 PM IST

టోక్యో ఒలింపిక్స్​ తర్వాత రిటైర్మెంట్ ప్రకటిస్తానని తెలిపింది భారత స్టార్ బాక్సర్ మేరీ కోమ్​. 2020 విశ్వక్రీడల్లో స్వర్ణాన్ని నెగ్గి కెరీర్​ను దిగ్విజయంగా ముగిస్తానని చెప్పింది. 18 ఏళ్ల బాక్సింగ్ కెరీర్​లో ఆరు సార్లు ప్రపంచ ఛాంపియన్​షిప్​ను గెల్చుకుంది మేరీ.


"2020 ఒలింపిక్స్ తర్వాత రిటైరవుతాను. టోక్యోలో భారత తరపున పసిడి గెలిచి విరమించుకుంటాను. దేశానికి బంగారు పతకాన్ని అందించడానికే ఎప్పుడూ ప్రయత్నిస్తాను. ప్రస్తుతం విశ్వ క్రీడలకు సన్నద్ధమయ్యేందుకు తగినంత సమయముంది" - మేరీ కోమ్, బాక్సర్​

2012 ఒలింపిక్స్​లో కాంస్యం నెగ్గింది మేరీకోమ్. 2016 రియో ఒలింపిక్స్​కు అర్హత సాధించడంలో విఫలమైన మేరీ 48 కేజీల విభాగానికి మారింది. ప్రస్తుతం 51 కేజీల విభాగంలో పోటీ పడుతోంది. ఐదు సార్లు ఆసియన్ ఛాంపియన్​గా అవతరించిందీ మణిపుర్ మణిపూస.

ఇది చదవండి: డివిలియర్స్​ వస్తానన్నా.. వద్దన్నారు

ABOUT THE AUTHOR

...view details