భారత స్టార్ బాక్సర్ మేరీ కోమ్ - నిఖత్ జరీన్ మధ్య జరిగిన ఒలింపిక్ ట్రయల్స్ పోరులో మేరీ సులువుగా గెలిచింది. ఒలింపిక్స్ అర్హత పోటీల కోసం 51 కేజీల విభాగంలో నిర్వహించిన ట్రయల్స్‌లో హైదరాబాదీ బాక్సర్ జరీన్ 1-9 తేడాతో ఓడిపోయింది. ఫలింతగా మేరీకోమ్ వచ్చే ఏడాది టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది.
నిఖత్‌పై మేరీదే పైచేయి.. ఒలింపిక్స్ బెర్తు ఖరారు - నిఖత్ జరీన్
ఒలింపిక్స్ అర్హత పోటీల కోసం నిర్వహించిన ట్రయల్స్‌లో హైదరాబాదీ బాక్సర్ నిఖత్ జరీన్‌పై మేరీకోమ్ ఘనవిజయం సాధించింది. ఫలితంగా ఒలింపిక్స్‌కు బెర్తు ఖరారు చేసుకుంది.
మేరీ
ఒలింపిక్స్ అర్హత పోటీలకు ట్రయల్స్ నిర్వహించాలని హైదరాబాదీ బాక్సర్ నిఖత్ జరీన్.. కొన్ని రోజుల క్రితం డిమాండ్ చేసింది. ఈ మేరకు రెండు రోజులు పాటు ఈ పోటీలను నిర్వహించింది భారత బాక్సింగ్ ఫెడరేషన్. 51, 57, 60, 69, 75 కేజీల విభాగాల్లో ఈ ట్రయల్స్ జరుగుతున్నాయి.