Malaysia Masters 2023 Final HS Prannoy : మలేసియా మాస్టర్స్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ హెచ్‌ఎస్ ప్రణయ్ అదరగొట్టాడు. సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఇండోనేసియా ప్లేయర్ క్రిస్టియన్ అడినటాను వెనక్కు నెట్టి ఫైనల్లో అడుపెట్టాడు. మొదటి గేమ్‌లో 19-17తో ప్రణయ్ లీడ్‌లో ఉండగా.. అడినటా గాయంతో వెనుదిరిగాడు. ఓ షాట్‌కు ప్రయత్నించే సమయంలో ఎగిరి.. ల్యాండ్ అవుతుండగా అడినటా ఎడమ మోకాలుకు గాయం అయింది. దీంతో తీవ్ర నొప్పితో బాధపడిన అడినటాను వీల్ ఛైర్లో కోర్టు బయటకు తీసుకెళ్లారు. ఇక ఫైనల్లో చైనీస్ తైపీ లేదా చైనాకు చెందిన షట్లర్ లిన్ చుయ్ను ప్రణయ్ ఎదుర్కొనున్నాడు. అయితే, పారిస్ ఒలంపిక్స్‌కు చేరుకునేందుకు ఈ మలేసియా మాస్టర్స్ టోర్నీయే మొదటి ఈవెంట్.
Malaysia Masters 2023 PV Sindhu : ఇకపోతే ఈ టోర్నీలో తన అద్భుత ప్రదర్శనతో సెమీఫైనల్స్‌కు దూసుకెళ్లింది ఒలింపిక్ పతక విజేత, భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు. అయితే మహిళల సింగిల్స్‌లో భాగంగా శనివారం జరిగిన సెమీఫైన్లో సింధు 14-21, 17-21తో ఇండోనేసియాకు చెందిన జార్జియా మరిస్కా టున్ జుంగ్ చేతిలో ఓడిపోయింది. ఈ మ్యాచ్ కేవలం 44 నిమిషాల్లోనే ముగిసింది. ఈ టోర్నీ కంటే ముందు జరిగిన స్పెయిన్ టోర్నీలో కూడా సింధు కాస్తలో టైటిల్ మిస్ చేసుకుంది. ఫైనల్లో ఓడి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. గాయాల నుంచి కోలుకున్న సింధు ఇప్పటి వరకు ఒక్క కప్పు కూడా కొట్టలేదు. అయితే, ఈ మలేసియా మాస్టర్స్ ట్రోఫీ దాదాపు ఖాయం అనుకున్న దశలో సింధుకు నిరాశే మిగిలింది.