తెలంగాణ

telangana

ETV Bharat / sports

ప్రపంచ ఛాంపియన్​షిప్​ సెమీస్​లో మేరీ కోమ్​ - 'Magnificent Mary' secures 8th world medal, enters semifinals

రష్యా ఉలాన్ ఉద్ వేదికగా జరుగుతోన్నబాక్సింగ్ ఛాంపియన్​షిప్​లో పతకాన్ని ఖరారు చేసుకుంది భారత బాక్సర్ మేరీ కోమ్. క్వార్టర్స్​లో వెలెన్సియా విక్టోరియాపై విజయం సాధించింది.

మేరీ కోమ్

By

Published : Oct 10, 2019, 11:37 AM IST

Updated : Oct 10, 2019, 12:45 PM IST

ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్​షిప్​లో భారత స్టార్ బాక్సర్ మేరీ కోమ్ పతకం ఖరారు చేసుకుంది. రష్యా ఉలాన్ ఉద్ వేదికగా జరుగుతున్న ఈ టోర్నీలో కొలంబియాకు చెందిన వెలెన్సియా విక్టోరియాపై విజయం సాధించి సెమీస్ చేరింది.

51 కిలోల విభాగంలో బరిలో దిగిన మేరీ.. క్వార్టర్స్​లో 5-0 తేడాతో ప్రత్యర్థిపై పంచ్​లు వర్షం కురిపించి మ్యాచ్ సొంతం చేసుకుంది. ఈ గెలుపుతో ఈ టోర్నీలో ఎక్కువ విజయాలు సాధించిన బాక్సర్​గా చరిత్ర సృష్టించింది.

"పతకాన్ని ఖరారు చేసుకున్నందుకు ఆనందంగా ఉంది. కానీ ప్రస్తుతం నా దృష్టి ఫైనల్​పైనే ఉంది. ప్రదర్శనను ఇంకా మెరుగుపరచుకొని సెమీస్​, తుదిపోరులోనూ సత్తాచాటుతా" -మేరీ కోమ్, భారత బాక్సర్

మేరీ ఖాతాలో 8వ పతకం ..

ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్​షిప్​లో ఇప్పటివరకు 7 పతకాలు(ఆరు స్వర్ణాలు, ఒక రజతం) గెలిచిన మేరీ కోమ్... ఈ విజయంతో 8వ మెడల్ ఖరారు చేసుకుంది.

పంచ్ ధాటికి పతకాలు క్యూ..

ఇవే కాకుండా 2012 లండన్ ఒలింపిక్స్​లో కాంస్యం.. కామన్వెల్త్, ఆసియా క్రీడల్లో స్వర్ణాలు ఆమె ఖాతాలో ఉన్నాయి. ఈ ఏడాది ఇండియా ఓపెన్, ఇండోనేసియాలో జరిగిన ప్రెసిడెన్షియల్​కప్​లోనూ పసిడి పతకాలు కైవసం చేసుకుంది మేరీ.

ఇదీ చదవండి: రెండేళ్లు దాటినా.. బాహుబలి రికార్డు బద్దలు కాలేదు!

Last Updated : Oct 10, 2019, 12:45 PM IST

ABOUT THE AUTHOR

...view details