ఐపీఎల్ వచ్చిన తర్వాత మిగతా క్రీడల్లోనూ ఈ తరహా విధానాన్ని అనుసరిస్తున్నారు. ఫుట్‌బాల్, బ్యాడ్మింటన్, కబడ్డీ... ఇలా ఆయా బోర్డులు ఐపీఎల్ పంథానే ఎంచుకున్నాయి. తాజాగా ఈ జాబితాలోకి ఖోఖో చేరింది. 'అల్టిమేట్ ఖోఖో' పేరుతో మంగళవారం లీగ్‌ను ఆవిష్కరించింది 'భారత ఖోఖో ఫెడరేషన్' (కేకేఎఫ్ఐ).
21 రోజుల పాటు ఈ లీగ్ ఉంటుంది. 8 ఫ్రాంఛైజీ జట్లు డబుల్ రౌండ్ రాబిన్ ఫార్మాట్ (ఒక్కో జట్టు మరో టీమ్‌తో రెండు సార్లు తలపడుతుంది)లో మొత్తం 60 మ్యాచ్‌లు ఆడునున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రీడాకారులను ఈ లీగ్‌లో కోనుగోలు చేసి తమ ఫ్రాంఛైజీల తరఫున ఆడించుకోవచ్చు.