ఒలింపిక్స్(Tokyo olympics) మహా క్రీడాసంబరం లాంఛనంగా మొదలవడానికి రెండు రోజులు సమయం ఉండగానే కొన్ని పోటీలు మొదలయ్యాయి. ఇందులో భాగంగా బుధవారం సాఫ్ట్బాల్ పోటీలు ప్రారంభమయ్యాయి. తొలి మ్యాచ్లో ఆతిథ్య జపాన్ శుభారంభం చేసింది. ప్రత్యర్థి జట్టు ఆస్ట్రేలియాను 8-1తేడాతో మట్టికరిపించింది. ఈ మ్యాచ్ విజయంలో 39 ఏళ్ల యుకికో వెనో(Yukiko Ueno) కీలకంగా వ్యవహరించింది.
ఈ మ్యాచ్ను ఒలింపిక్స్ ప్రధాన వేదిక నుంచి 150 మైళ్ల దూరంలో 30వేల మంది ప్రేక్షకులు ఒకేసారి కూర్చునే సామర్థ్యం ఉన్న స్డేడియంలో నిర్వహించారు. అయితే ప్రేక్షకులు లేకుండానే కేవలం ఒలింపిక్ నిర్వాహకులు, మీడియా సమక్షంలో(మొత్తంగా 50మంది) ఈ ఈవెంట్ జరిగింది. రెండో మ్యాచ్లో ఇటలీపై అమెరికా 2-0 తేడాతో విజయం సాధించింది.