టోక్యోలో ప్రజల సందర్శనార్ధం ఉంచిన ఒలింపిక్ జ్యోతిని తొలగిస్తున్నట్లు నిర్వహకులు స్పష్టం చేశారు. కరోనా వల్ల తమ దేశంలో నెలకొన్న పరిస్థితుల కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఈ వైరస్ వల్ల ఇప్పటికే మెగాక్రీడలు వచ్చే ఏడాదికి వాయిదా పడ్డాయి.
ఒలింపిక్ జ్యోతి ప్రదర్శనకు కరోనా దెబ్బ - sports news
జపాన్లోని ఫుకుషిమాలో ఉన్న ఒలింపిక్ జ్యోతి ప్రదర్శనను నిలిపిసేస్తున్నట్లు నిర్వహకులు చెప్పారు. ప్రాణాంతక కరోనా తీవ్రత పెరుగుతుండటం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.
"ఈ జ్యోతిని ప్రజల చూసేందుకు వీలుగా, గత వారం నుంచి ఏప్రిల్ చివరి వరకు అందుబాటులో ఉంచాలని అనుకున్నాం. కానీ ప్రస్తుతం పరిస్థితుల వల్ల దీనిని ఆపాలని నిర్ణయం తీసుకున్నాం" -టోక్యో 2020 కమిటీ నిర్వహకుడు
అయితే జపాన్లో ఒలింపిక్ స్పూర్తిని సజీవంగా ఉంచేందుకు, జ్యోతిలోని మంటను ఓ లాంతరులో ఉంచాలని స్థానిక నిర్వహకులు భావించారు. అందుకు తగ్గట్లుగానే ఫుకుషిమాలో ఎక్కడైతే టార్చ్ రిలే మొదలవుతుందో అక్కడే ఒలింపిక్ లాంతరును ప్రదర్శనకు ఉంచారు. ఈ క్రీడలు వచ్చే ఏడాది జులై 23 నుంచి ఆగస్టు 8 మధ్య జరగనున్నాయి.