తెలంగాణ

telangana

ETV Bharat / sports

షూటింగ్ ప్రపంచకప్​ పూర్తి.. భారత్​కు​ పతకాల పంట - shooting

దిల్లీలో జరిగిన షూటింగ్ ప్రపంచకప్​ను భారత్ అగ్రస్థానంతో ముగించింది. ఆదివారం జరిగిన ట్రాప్ టీమ్​ ఈవెంట్​లో పురుషుల, మహిళల బృందం బంగారు పతకాలు సొంతం చేసుకుంది.

ISSF shooting world cup overall
షూటింగ్ ప్రపంచకప్​ పూర్తి.. భారత్​కు​ పతకాల పంట

By

Published : Mar 28, 2021, 3:31 PM IST

Updated : Mar 28, 2021, 3:53 PM IST

ఐఎస్​ఎస్​ఎఫ్ షూటింగ్ ప్రపంచకప్​ను భారత్​ ఘనంగా ముగించింది. ఆదివారం చివరగా జరిగిన ట్రాప్ టీమ్ ఈవెంట్​లో మన పురుషుల బృందం స్వర్ణాన్ని కైవసం చేసుకుంది. 6-4 తేడాతో కజికిస్థాన్​పై విజయం సాధించింది. మన బృందంలో పృథ్వీరాజ్ తొండైమన్, లక్ష్య సియోరన్, క్యనన్ చెనై ఉన్నారు.

ఇదే విభాగంలో మన మహిళా బృందం కూడా బంగారు పతకం సొంతం చేసుకుంది. కజికిస్థాన్​పై 6-0 తేడాతో విజయం సాధించింది. మన టీమ్​లో శ్రేయసి సింగ్, రాజేశ్వరి కుమారి, మనీషా కీర్ ఉన్నారు.

షూటింగ్ ప్రపంచకప్

అంతకు ముందు 25 మీటర్ల రాపిడ్ ఫైర్​ టీమ్​ ఈవెంట్​లో మన పురుషుల బృందం వెండి పతకం సాధించింది. ఇందులో విజయ్​వీర్ సిద్ధు, గుర్​ప్రీత్ సింగ్, ఆదర్శ్ సింగ్ ఉన్నారు. ఆదివారం ఉదయం జరిగిన ఈ పోటీలో యూఎస్​ఏ టీమ్​పై 10-2 తేడాతో గెలిచింది.

Last Updated : Mar 28, 2021, 3:53 PM IST

ABOUT THE AUTHOR

...view details