రానున్న ఐదేళ్ల కాలానికి (2025) ఒలింపిక్ అజెండాను ఖరారు చేసింది అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ). 2020+5 పేరుతో కొత్త వ్యూహత్మక రోడ్‌మ్యాప్‌ను ఏకగ్రీవంగా ఆమోదించింది. ఒలింపిక్ ఉద్యమం సజావుగా సాగటానికి 15 సిఫార్సులను అంగీకరించింది.
"కరోనా సంక్షోభం మన ప్రాథమిక మార్గాలను మార్చివేసింది. కొవిడ్ కంటే ముందులా ప్రపంచం ఉండబోదు. ఈ ఆరోగ్య సంక్షోభాన్ని ఇప్పుడిప్పుడే అధిగమిస్తున్నప్పటికీ.. ముందు ముందు సామాజిక, ఆర్థిక, ద్రవ్య, రాజకీయ పరమైన విపత్తులు ఎదుర్కోవాల్సి ఉంది. ఒలింపిక్ ఉద్యమం నాయకులుగా కొత్త ప్రపంచానికి తగ్గట్లు మనం సిద్ధం కావాలి. భవిష్యత్ తరాల కోసం ముందు చూపు అవసరం."