తెలంగాణ

telangana

ETV Bharat / sports

'రెజ్లర్లకు ఆ మినహాయింపులు అన్యాయం.. ఇదంతా అందుకోసమేనా?' - wrestlers protest updates

wrestlers protest : ఆసియా క్రీడలు, ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ సెలెక్షన్‌ ట్రయల్స్‌లో ఆరుగురు రెజ్లర్లకు మినహాయింపు ఇవ్వడాన్ని లండన్‌ ఒలింపిక్స్‌ కాంస్య పతక విజేత యోగేశ్వర్‌ దత్‌ తప్పుబట్టాడు. రెజ్లర్లు ఆందోళన చేస్తున్నది ఇందుకేనా అని ప్రశ్నించాడు.

world championship selection2023
wrestlers protest

By

Published : Jun 24, 2023, 6:52 AM IST

Updated : Jun 24, 2023, 6:58 AM IST

Asian Wrestling Championship : ఆసియా క్రీడలు,ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ సెలెక్షన్స్​లో భాగంగా ట్రయల్స్‌లో ఆరుగురు రెజ్లర్లకు మినహాయింపు ఇవ్వడాన్ని లండన్‌ ఒలింపిక్స్‌ కాంస్య పతక విజేత యోగేశ్వర్‌ దత్‌ తప్పుబట్టాడు. రెజ్లర్లు ఆందోళన చేస్తున్నది ఇందుకోసమేనా అంటూ ప్రశ్నించాడు. నిరసనలో పాల్గొన్న రెజ్లర్లు పోటీపడాల్సిన బౌట్‌లను ఒకటికి తగ్గిస్తూ ఐఓఏ అడ్‌హక్‌ కమిటీ ఇటీవలే నిర్ణయం తీసుకుంది. దీని ద్వారా ప్రాథమిక ట్రయల్స్‌ నుంచి మినహాయింపు పొందిన బజ్‌రంగ్‌ పునియా, వినేశ్‌ ఫొగాట్‌, సాక్షి మలిక్‌, సంగీత ఫొగాట్‌, సత్యవర్త్‌ కడియన్‌, జితేందర్‌ కిన్హాలు సెలెక్షన్స్‌ విజేతలతో పోటీపడి గెలిస్తే ఇక అలానే జట్టులో చోటు దక్కించుకోవచ్చు.

"ఏ కొలమానం ప్రకారం అడ్‌హక్‌ కమిటీ ట్రయల్స్‌పై నిర్ణయం తీసుకుందో నాకు అర్థం కావట్లేదు. అది కూడా మొత్తం ఆరుగురు రెజ్లర్లకు. ఒలింపిక్స్‌లో రవి దహియా రజత పతకం సాధించాడు. కామన్వెల్త్‌ క్రీడల్లో స్వర్ణం గెలిచాడు. దీపక్‌ పునియా కూడా కామన్వెల్త్‌లో బంగారు పతకాన్ని నెగ్గాడు. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో అన్షు మలిక్‌ రజతం సాధించింది. సోనమ్‌ మలిక్‌తో పాటు మరికొందరు కూడా ఈ జాబితాలో ఉన్నారు. మరి ఈ ఆరుగురికి ఎందుకు మినహాయింపులు ఇచ్చారో నాకు అర్థం కావట్లేదు. ఇది పూర్తిగా తప్పు. భారత రెజ్లింగ్‌ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్‌) గత పాలక వర్గం సమయంలో కూడా ఇలాంటిది జరగలేదు. ఈ వివక్షకు వ్యతిరేకంగా రెజ్లర్లంతా తమ గళాన్ని పెంచాలని కోరుతున్నాను" అని యోగేశ్వర్‌ పేర్కొన్నాడు.

అతను బ్రిజ్‌ భూషణ్‌ తొత్తు

Vinesh Phogat Wrestling : ఇక సీనియర్​ రెజ్లర్‌ యోగేశ్వర్‌ దత్‌ చేసిన విమర్శలపై స్టార్‌ క్రీడాకారిణి వినేశ్‌ ఫొగాట్‌ తీవ్రంగా విరుచుకుపడింది. బీడబ్ల్యూఎఫ్‌ అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌కు తొత్తుగా యోగేశ్వర్‌ను రెజ్లింగ్‌ ప్రపంచం గుర్తుంచుకుంటుందంటూ విమర్శించింది. "బ్రిజ్‌ భూషణ్‌ ఎంగిలి మెతుకులను యోగేశ్వర్‌ తింటున్నాడని రెజ్లింగ్‌ ప్రపంచానికి అర్థమైంది. సమాజంలో అన్యాయానికి వ్యతిరేకంగా ఎవరైనా గళం విప్పితే వారిని విమర్శించేందుకు దత్‌ ముందుంటాడు. లైంగిక వేధింపుల ఆరోపణల విచారణకు ఏర్పాటైన కమిటీల్లో దత్‌ కూడా ఉన్నాడు. వేధింపుల గురించి మహిళా రెజ్లర్లు వివరిస్తున్నప్పుడు దత్‌ వికారంగా నవ్వాడు. అది నా మనస్సులో అలానే ఉండిపోయింది. ఇద్దరు మహిళా రెజ్లర్లు నీళ్లు తాగడానికి బయటికి వెళ్లినప్పుడు దత్‌ వాళ్లను అనుసరించాడు. 'బ్రిజ్‌ భూషణ్‌కు ఏమీ కాదు.. వెళ్లి ప్రాక్టీస్‌ మొదలుపెట్టండి' అని వాళ్లతో దత్​ అన్నాడు. 'ఇలాంటివి (లైంగిక వేధింపులు) జరుగుతూనే ఉంటాయి.. వాటిని పెద్దవి చేయకు' అని మరో మహిళా రెజ్లర్‌తో వ్యాఖ్యానించాడు. కమిటీ సమావేశం తర్వాత మహిళా రెజ్లర్ల పేర్లను బ్రిజ్‌ భూషణ్‌కు, మీడియాకు వెల్లడించాడు" అని వినేశ్‌ దత్​ విషయంలో ఆరోపించింది.

ఇవీ చదవండి:

రెజర్లకు ఊరట.. ఆ రెండింట్లో ఒక్కదానికే..

'ఆ కేసులో ఆధారాల్లేవ్'.. బ్రిజ్ భూషణ్​పై పోక్సో కేసు రద్దు! దిల్లీ పోలీసుల ఛార్జ్​షీట్

Last Updated : Jun 24, 2023, 6:58 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details