తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఖోఖోలో పురుషులు, మహిళల జట్లకు స్వర్ణాలు

నేపాల్​లో జరుగుతున్న దక్షిణాసియా క్రీడల్లో భారత బృందం మెరిసింది. ఖోఖో విభాగంలో పురుషులు, మహిళల జట్లు బంగారు పతకాలు సొంతం చేసుకున్నాయి.

Indian men, women's kho kho teams win gold medals in South Asian Games
ఖోఖోలో పురుషులు, మహిళల జట్లకు స్వర్ణాలు

By

Published : Dec 4, 2019, 9:37 PM IST

13వ దక్షిణాసియా పోటీల్లో భారత్​ పురుషులు, మహిళల ఖోఖో జట్లు ఆకట్టుకున్నాయి. ప్రత్యర్థులు బంగ్లాదేశ్​, నేపాల్​లను తుదిపోరులో ఓడించి స్వర్ణపతకాలు కైవసం చేసుకున్నాయి.

2016లో స్వర్ణాన్ని గెలిచిన భారత పురుషుల జట్టు.. ఈ టోర్నీలో బంగ్లాదేశ్​పై 16-9స్కోరు తేడాతో విజయం సాధించింది. మహిళలు 17-5 తేడాతో నేపాల్​పై మెరుపు వేగంతో దూసుకుపోయి గెలిచారు.

తైక్వాండోలో భారత్​కు 6 పతకాలు

ఇక్కడే జరుగుతోన్న తైక్వాండో పోటీల్లో భారత్..​ మూడు స్వర్ణాలు సహా ఆరు పతకాలను కైవసం చేసుకుంది. 53 కిలోల విభాగంలో లిఖిత, 74 కిలోల విభాగంలో జర్నెల్​ సింగ్​, 73 కిలోలపైగా ఉన్న విభాగంలో రుడాలి.. బంగారు పతకాలను సొంతం చేసుకున్నారు. 63 కిలోల విభాగంలో సౌరభ్​, గాంగ్జోట్​ రజతం.. 86 కిలోల విభాగంలో చైతన్య కాంస్యతో సరిపెట్టుకున్నాడు.

ఇది చదవండి: బీసీసీఐ నూతన చీఫ్ సెలక్టర్​ అతడేనా?

ABOUT THE AUTHOR

...view details