Indian Chess League: వచ్చే ఏడాది జూన్‌లో ఇండియన్ చెస్ లీగ్ (ఐసీఎల్) ప్రారంభం కాబోతున్నట్లు అఖిల భారత చెస్ సమాఖ్య (ఏఐసీఎఫ్) మంగళవారం వెల్లడించింది. ఆరు ఫ్రాంఛైజీలతో నిర్వహిస్తున్న ఈ లీగ్‌లో ప్రతి జట్టులో ఇద్దరు సూపర్ గ్రాండ్‌మాస్టర్లు, ఇద్దరు భారత గ్రాండ్‌మాస్టర్లు, ఇద్దరు మహిళా గ్రాండ్‌మాస్టర్లు, భారత జూనియర్ బాలుడు, బాలిక ఉంటారు. డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో.. రెండు నగరాల్లో ఈ పోటీలు నిర్వహిస్తారు.
Indian Chess League: వచ్చే జూన్‌లో ఇండియన్ చెస్ లీగ్ - ఇండియన్ చెస్ లీగ్ లేటెస్ట్ న్యూస్
Indian Chess League: వచ్చే ఏడాది జూన్‌లో ఇండియన్ చెస్ లీగ్ ప్రారంభం కాబోతున్నట్లు అఖిల భారత చెస్ సమాఖ్య వెల్లడించింది. ఈ లీగ్ ద్వారా భారత చెస్ ముఖచిత్రం మారబోతుందని ఏఐసీఎఫ్ అధ్యక్షుడు సంజయ్ కపూర్ తెలిపారు.
Indian Chess League
"త్వరలోనే మా కల తీరబోతోంది. ఇండియన్ చెస్ లీగ్ ద్వారా భారత చెస్ ముఖచిత్రం మారబోతోంది. చెస్‌లో మన జట్టు నంబర్‌వన్ కావడానికి ఈ లీగ్ దోహదం చేస్తుంది" అని ఏఐసీఎఫ్ అధ్యక్షుడు సంజయ్ కపూర్ చెప్పారు. ఫ్రాంఛైజీ యజమానికి ఉండాల్సిన అర్హతల గురించి త్వరలోనే వివరాలు వెల్లడిస్తామని.. కార్పొరేట్ కంపెనీలు లీగ్‌కు మద్దతు ఇవ్వడానికి ముందుకొస్తున్నాయని ఏఐసీఎఫ్ కార్యదర్శి భరత్ సింగ్ తెలిపాడు.