Asia team Badminton India loses: ఆసియా టీమ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో భారత్ పోరాటం ముగిసింది. గ్రూపు దశలో విఫలమైన భారత పురుషులు, మహిళల జట్లు సెమీఫైనల్‌కు అర్హత సాధించడంలో విఫలమయ్యాయి. శుక్రవారం జరిగిన గ్రూపు దశ చివరి లీగ్ మ్యాచ్‌ల్లో భారత జట్లకు చుక్కెదురైంది. పురుషుల గ్రూపు-ఎలో భారత్ 2-3తో డిఫెండింగ్ ఛాంపియన్ ఇండోనేసియా చేతిలో పోరాడి ఓడింది. మూడు లీగ్ మ్యాచ్‌ల్లో ఒకేఒక్క విజయంతో పట్టికలో మూడో స్థానంలో నిలిచిన భారత్ నాకౌట్ బెర్తుకు దూరమైంది. ఇండోనేసియా, కొరియా సెమీస్ చేరుకున్నాయి. మహిళల గ్రూపు-వై పోరులో భారత్ 1-4తో జపాన్ చేతిలో పరాజయం చవిచూసింది. గ్రూపు దశలో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడిన భారత్ అట్టడుగు స్థానంలో నిలిచింది. మలేసియా, జపాన్ ముందంజ వేశాయి.
ఆసియా టీమ్ బ్యాడ్మింటన్.. ముగిసిన భారత్ పోరాటం - ఆసియా టీమ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్
Asia team Badminton India loses: ఆసియా టీమ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో భారత్ కథ ముగిసింది. గ్రూపు దశ చివరి లీగ్ మ్యాచ్‌ల్లో మన జట్లకు చుక్కెదురైంది. దీంతో పురుషులు, మహిళల జట్లు సెమీఫైనల్‌కు అర్హత సాధించలేకపోయాయి.
చివరి లీగ్ మ్యాచ్‌లో భారత పురుషుల జట్టు పోరాడింది. తొలి సింగిల్స్‌లో లక్ష్యసేన్ 21-18, 27-25తో వార్డోయో చికోపై గెలిచి భారత్‌కు శుభారంభం అందించాడు. మొదటి డబుల్స్‌లో మంజిత్‌సింగ్- డింకూసింగ్ జోడీ 16-21, 10-21తో లియో రోలీ- మార్టిన్ డానియెల్ జంట చేతిలో ఓడటంతో 1-1తో స్కోరు సమమైంది. రెండో సింగిల్స్‌లో కిరణ్ జార్జ్ 13-21, 21-17, 10-21తో లియోనార్డో ఇమాన్యుయెల్ చేతిలో పోరాడి ఓడాడు. రెండో డబుల్స్‌లో హరిహరన్- రుబన్‌కుమార్ జంట 10-21, 10-21తో ఫిక్రి మహ్మద్- మౌలానా బాగాస్ జోడీ చేతిలో పరాజయం చవిచూడటంతో ఇండోనేసియా 3-1తో భారత్‌పై పైచేయి సాధించింది. మూడో సింగిల్స్‌లో మిథున్ మంజునాథ్ 21-12, 15-21, 21-17తో యొనాథన్‌పై నెగ్గి భారత్‌కు ఊరట విజయాన్ని అందించాడు. మహిళల విభాగంలో సింగిల్స్‌లో అష్మిత మాత్రమే గెలిచింది. చాలిహ 21-17, 10-21, 21-19తో గుంజి రైకోపై నెగ్గింది.
ఇదీ చూడండి: టీమ్ఇండియాదే సిరీస్.. రెండో టీ20లో విండీస్‌పై విజయం