రానున్న టోక్యో ఒలింపిక్స్(Tokyo Olympics)లో భారత్ నుంచి పాల్గొననున్న అథ్లెట్ల ప్రదర్శన పట్ల విశ్వాసం వ్యక్తం చేశారు కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రి కిరన్ రిజిజు(Kiren Rijiju). ఒలింపిక్స్లో పాల్గొనడానికి భారత్ సంసిద్ధంగా ఉందని తెలిపారు.
ఈ మెగా ఈవెంట్కు అర్హత సాధించిన అథ్లెట్లలో ఉత్సాహాన్ని నింపడానికి ప్రతి భారతీయుడు ముందుకు రావాలని రిజిజు కోరారు. ఇందుకు సంబంధించి ఓ వీడియోను ట్విట్టర్లో పంచుకున్నారు మంత్రి.
"ఈ విపత్కర సమయంలో దేశం కోసం ఒలింపిక్స్లో ఆడటానికి వెళ్తున్నా.. అథ్లెట్లను ఉత్సాహాపరచడానికి.. ప్రతి భారతీయుడు ముందుకు రావాలి. అవును, ఈ మెగా ఈవెంట్లో పాల్గొని.. విజయవంతమవడానికి ఇండియా సిద్ధంగా ఉంది."