ఆసియా పురుషుల అండర్-23 వాలీబాల్ ఛాంపియన్షిప్ గెలిచేందుకు అడుగుదూరంలో నిలిచింది భారత జట్టు. మయన్మార్ వేదికగా శనివారం జరిగిన సెమీఫైనల్లో పాకిస్థాన్‌ను మట్టికరిపించింది. హోరాహోరీగా సాగిన ఆటలో 21-25తో తొలి సెట్ కోల్పోయిన ఇండియా... 25-16, 25-22, 25-18 తేడాతో వరుస సెట్లలో పాక్‌ను ఓడించింది. ఫలితంగా తొలిసారి ఈ టోర్నీలో ఫైనల్ చేరింది.
పాక్‌ను కొట్టేసి.. చరిత్ర సృష్టించిన భారత్
భారత పురుషుల వాలీబాల్ జట్టు అరుదైన రికార్డు సృష్టించింది. మయన్మార్ వేదికగా జరుగుతోన్న ఆసియా అండర్-23 ఛాంపియన్‌షిప్‌లో తొలిసారి ఫైనల్ చేరింది. శనివారం జరిగిన సెమీస్ మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై విజయం సాధించింది.
పాక్‌ను ఓడించి టైటిల్ రేసులో భారత జట్టు
ఆదివారం జరగనున్న ఫైనల్లో చైనీస్ తైపీని ఢీకొనబోతుంది భారత వాలీబాల్ జట్టు. సెమీస్‌లో 3-2తో జపాన్‌ను ఓడించిన తైపీ తుది సమరానికి అర్హత సాధించింది. ఈ టోర్నీలో ఫైనల్ చేరడం ద్వారా భారత్.. ఎఫ్‌ఐవీబీ ప్రపంచ పురుషుల అండర్-23 ఛాంపియన్‌షిప్‌కు అర్హత సాధించింది.
ఇవీ చూడండి...'తిబిలిసి గ్రాండ్ ప్రీ'లో భజరంగ్ భళా