Harmanpreet Kaur Cricketer : భారత ఉమెన్ క్రికెట్ జట్టు కెప్టెన్‌హర్మన్‌ప్రీత్ కౌర్‌పై ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ చర్యలు తీసుకుంది. వచ్చే రెండు ఇంటర్నేషనల్ మ్యాచుల్లో పాల్గొనకుండా నిషేధం విధించింది. శనివారం బంగ్లాదేశ్ మహిళలతో జరిగిన మూడో వన్డేలో.. ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించినందుకు ఐసీసీ ఈ చర్యలు తీసుకుంది. ఈ మ్యాచ్‌లో అంపైర్.. హర్మన్‌ను ఔట్‌గా ప్రకటించాడు. కాకపోతే.. అది ఎల్బీనా లేదా క్యాచ్ ఔటా అన్నదానిపై మొదట సందేహం నెలకొంది. క్యాచ్ ఔట్ అనే విషయం తర్వాత తేలింది. హర్మన్ ఔటే అయినప్పటికీ.. బౌలర్ అప్పీల్ చేయడమే ఆలస్యం ఔట్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు అంపైర్లు వ్యవహరించడం ఆమె కోపానికి కారణమైంది. దీంతో స్టంప్స్‌ను బ్యాట్‌తో కొట్టిన హర్మన్.. అంపైర్ల వైపు సంజ్ఞలు చేస్తూ, ఏవో మాటలంటూ బయటకు వెళ్లిపోయింది.
హర్మన్ ప్రీత్‌పై ఐసీసీ చర్యలు.. రెండు అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడకుండా బ్యాన్.. - హర్మన్‌ప్రీత్ కౌర్క ఐసీసీ జరిమానా
Harmanpreet Kaur Cricketer : కెప్టెన్ హర్మన్ ప్రీత్‌పై చర్యలు తీసుకుంది ఐసీసీ. రెండు అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడకుండా నిషేధం విధించింది. బంగ్లాదేశ్ మహిళలతో జరిగిన మూడో వన్డేలో.. ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించినందుకు ఈ చర్యలకు ఉపక్రమించింది.
అంతకుముందు యాస్తిక ఎల్బీ, ఆఖరి ఓవర్లో మేఘన క్యాచ్ విషయంలోనూ ఇదే తంతు జరిగిందని భారత్ అసంతృప్తి వ్యక్తం చేసింది. మ్యాచ్ ముగిసిన అనంతరం అంపైర్ల తీరుపై హర్మన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిని సీరియస్‌గా తీసుకున్న ఐసీసీ.. ఆమెపై చర్యలకు ఉపక్రమించింది. మ్యాచ్ ఫీజులో 50శాతం మేర కోత సైతం విధించింది. అంతేకాకుండా.. వ్యక్తిగత క్రమశిక్షణ రికార్డులో 3 డీమెరిట్ పాయింట్లను జోడించింది. మరోవైపు మ్యాచ్ ముగిశాక అంపైర్‌పై చేసిన వ్యాఖ్యలకు గానూ.. మ్యాచ్ ఫీజులో 25శాతం మేర కోత విధించింది.
ఇదీ జరిగింది..
శనివారం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్లో.. భారత ఇన్నింగ్స్ 34వ ఓవర్లో ఎఫైర్‌పై హర్మన్‌ప్రీత్ కౌర్ అసహనం వ్యక్తం చేసింది. బంగ్లా బౌలర్ నహిదా అక్తర్ సంధించిన మూడో బాల్‌ను లెగ్ సైడ్ ఆడే ప్రయత్నం చేసింది హర్మన్. అయితే బంతి బ్యాట్ ను తాకిందా లేదా ఆమె ప్యాడ్లను తాకిందా అనేది క్లారిటీ అవ్వలేదు. అదే సమయంలో బంగ్లాదేశ్ ప్లేయర్లు ఎల్బీ కోసం అప్పీల్ చేయగా.. ఫీల్డ్ అంపైర్ ఔట్‌గా ప్రకటించాడు. పైగా ఈ సిరీస్‌లో డీఆర్‌ఎస్ అందుబాటులో లేదు. దీంతో అంపైర్‌దే తుది నిర్ణయం. ఇక ఇలా జరగడంతో హర్మన్ కోపంతో ఊగిపోయింది. అంపైరింగ్ సరిగ్గా చేయలేవా? అంటూ అరుస్తూ క్రీజును వీడింది.