తెలంగాణ

telangana

ETV Bharat / sports

హంగేరియన్​ గ్రాండ్​ ప్రిలో హామిల్టన్‌కు పోల్‌ పొజిషన్‌

ఫార్ములావన్​ ట్రాక్​పై మెర్సిడెజ్​ డ్రైవర్​ లూయిస్​ హామిల్టన్​ మరోసారి సత్తా చాటాడు. శనివారం జరిగిన హంగేరియన్​ గ్రాండ్​ ప్రి అర్హత రేసులో పోల్​ పొజిషన్​ సాధించాడు. ఇది తన కెరీర్​లో 90వ పోల్​ కావడం విశేషం.

By

Published : Jul 19, 2020, 10:08 AM IST

hungarian open 2020
హంగేరియన్​ గ్రాండ్​ ప్రి: హామిల్టన్‌కు పోల్‌ పొజిషన్‌

తనకు అచ్చొచ్చిన ట్రాక్‌పై ఫార్ములావన్‌ ప్రపంచ ఛాంపియన్‌ లూయిస్‌ హామిల్టన్‌ (మెర్సిడెజ్‌) జోరు ప్రదర్శించాడు. శనివారం జరిగిన హంగేరియన్‌ గ్రాండ్‌ ప్రి అర్హత రేసులో అగ్రస్థానంలో నిలిచిన అతను పోల్‌ పొజిషన్‌ సాధించాడు. ఆదివారం జరిగే ప్రధాన రేసును తొలి స్థానంతో మొదలెట్టనున్నాడు.

ఈ సీజన్‌లో అతనికిది వరుసగా రెండో పోల్‌ పొజిషన్‌. ఇదే ట్రాక్​పై అత్యధిక పోల్​(7 సార్లు) సాధించిన మైఖేల్​ షుమాకర్​ రికార్డును హామిల్టన్​ సమం చేశాడు. అంతేకాకుండా కెరీర్​లో 90 పోల్స్​ రికార్డును ఖాతాలో వేసుకున్నాడు.​ గతేడాది పోల్​ పొజిషన్​ సాధించిన మ్యాక్స్​ వెర్​స్టాపెన్​(రెడ్​బుల్​).. ఈసారి ఏడో స్థానంతోనే సరిపెట్టుకున్నాడు. ఈరోజు సాయంత్రం 6.40 నిమిషాలకు రేసు ప్రారంభం కానుంది.

గత వారం విజేతగా నిలిచిన స్టిరియన్‌ గ్రాండ్‌ ప్రి ప్రధాన రేసును.. హామిల్టన్​ పోల్‌ పొజిషన్‌తోనే మొదలెట్టాడు.

ABOUT THE AUTHOR

...view details