మహిళల స్పీడ్ చెస్ ఛాంపియన్‌షిప్స్ నాలుగో అంచె ఫైనల్లో గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి పరాజయం పాలైంది. ఆదివారం ఆమె 5-7తో అలెగ్జాండ్రా కొస్తెనుక్ (రష్యా) చేతిలో కంగుతింది. మొదట్లో ఇద్దరూ హోరాహోరీగా తలపడ్డా.. క్రమంగా కొస్తెనుక్ పైచేయి సాధించింది.
స్పీడ్ చెస్ ఛాంపియన్షిప్ ఫైనల్లో హంపి ఓటమి
ఆదివారం జరిగిన మహిళల స్పీడ్ చెస్ ఛాంపియన్షిప్ ఫైనల్లో భారత గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి ఓటమి పాలైంది. హోరాహోరీగా జరిగిన తుదిపోరులో రష్యాకు చెందిన అలెగ్జాండ్రా కొస్తెనుక్ చేతిలో హంపి పరాజయం చెందింది.
మహిళల స్పీడ్ చెస్ ఛాంపియన్షిప్ ఫైనల్లో హంపి ఓటమి
ఈ విజయంతో కస్తెనుక్ సోమవారం అనా ఉషెనినా (ఉక్రెయిన్)తో సూపర్ ఫైనల్‌కు అర్హురాలైంది. మరో పోరులో ప్రపంచ నంబర్‌వన్ హు ఇఫాన్ 7.5-2.5తో ఖాదిమ్లాషెరీ (ఇరాన్)పై నెగ్గి మూడో స్థానంలో నిలిచింది.