తెలంగాణ

telangana

ETV Bharat / sports

చివరి నిమిషాల్లో అనూహ్య గోల్​..చేజారిన మ్యాచ్​ - రషీద్​

ప్రపంచవ్యాప్తంగా ఫుట్​బాల్​కున్న ఆదరణ ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఈ ఆటలో అప్పుడప్పుడు అనూహ్య సంఘటనలు జరుగుతాయి. మైదానంలో ఆటగాళ్లు చేసే విన్యాసాలు, మైమరిపించే గోల్స్​, చిరుతల్లా పరిగెత్తడం వంటివి ప్రేక్షకుల్ని ఉర్రూతలూగిస్తాయి. అలాంటి సంఘటనే 2020 ఏఎఫ్​సీ అండర్​ -23 టోర్నీలో జరిగింది.

చివరి నిమిషాల్లో అనూహ్యం.. నిరాశలో గోల్​కీపర్​

By

Published : Mar 25, 2019, 6:54 AM IST

Updated : Mar 25, 2019, 8:18 AM IST

2020 ఏఎఫ్​సీ అండర్​-23 టోర్నీ క్వాలిఫయర్​ మ్యాచ్​లో అనూహ్యంగా గెలిచిందో జట్టు. మ్యాచ్​ 81వ నిమిషం వరకూ 0-0తో సమానంగా ఉన్నాయి మలేసియా, లావోస్​ జట్లు. అనంతరం లభించిన ఫ్రీకిక్​ను సద్వినియోగం చేసుకున్న మలేసియా గోల్​ నమోదు చేసింది. అయితే.. ఇందులో గొప్పేముందంటారా? గోల్​ వచ్చిన తీరు చూస్తే మీకే అర్థమవుతుంది.

చివరి నిమిషాల్లో అనూహ్యం.. నిరాశలో గోల్​కీపర్​

సఫావీ రషీద్​ కొట్టిన ఫ్రీకిక్​.. లావోస్​ గోల్​ కీపర్​ తప్పిదంతో గోల్​ పోస్ట్​లోకి వెళ్లింది. తొలుత గోల్​ పోస్ట్..​ పోల్​కు తాకి వెనక్కి వచ్చేదే. కానీ, దురదృష్టవశాత్తు కీపర్​ వెనుక భాగంలో తాకి పోస్ట్​లోకి వెళ్లిపోయింది. బంతిని అడ్డుకున్న కీపర్​ కూడా ఈ సంఘటనను ఊహించలేదు. మలేసియా 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. అనంతరం మ్యాచ్​ను గెల్చుకుంది. ఇంకేముంది సంబరాల్లో మలేసియా... నిరాశలో లావోస్​.

Last Updated : Mar 25, 2019, 8:18 AM IST

ABOUT THE AUTHOR

...view details