తెలంగాణ

telangana

ETV Bharat / sports

తొలిసారిగా ఆన్​లైన్​లో షూటింగ్​ పోటీలు - షూటింగ్ పోటీలు

కరోనా పరిణామాలతో ఓ షూటింగ్ లీగ్​ను, తొలిసారి జూమ్​ యాప్​ ద్వారా నిర్వహించనున్నారు. ఈ పోటీల్ని ఫేస్​బుక్​లో లైవ్ స్ట్రీమింగ్ ఇవ్వనున్నారు.

తొలిసారిగా ఆన్​లైన్​లో షూటింగ్​ పోటీలు
మహిళా షూటర్

By

Published : Jun 29, 2020, 7:01 PM IST

ప్రపంచంలోనే తొలిసారి ఆన్​లైన్​లో షూటింగ్ లీగ్ నిర్వహించనున్నారు. కరోనా ప్రభావంతో ఏర్పడిన పరిస్థితులే ఇందుకు కారణం. జులై 4 నుంచి ప్రారంభమయ్యే ఈ టోర్నీలో భారత్​ తరఫున 'ఇండియన్ టైగర్స్'​ జట్టు పాల్గొనుంది.

ఇందులో పాల్గొనే ప్రతి జట్టులో ముగ్గురు షూటర్స్​తో పాటు ఓ కోచ్ ఉంటారు. తాము ఉండే లోకేషన్స్​లో జూమ్ యాప్​లో లాగిన్​ అయిన తర్వాత వీరు పోటీలో పాల్గొంటారు. ఇరుజట్ల మధ్య జరిగిన పోరులో 10 పాయింట్ల గెల్చుకున్న తొలి జట్టును విజేతగా ప్రకటిస్తారు. జరిగే 10 మ్యాచ్​ల్ని, 'ఇండియన్ షూటింగ్' ఫేస్​బుక్ పేజ్​లో లైవ్​ స్ట్రీమింగ్ ఇవ్వనున్నారు.

విదేశీ షూటర్

మ్యాచ్​ల వివరాలు

  • జులై 4: ఆస్ట్రియన్ రాక్స్ x ఇటాలియన్ స్టైల్
  • జులై 5: ఇటాలియన్ స్టైల్ x ఇండియన్ టైగర్స్
  • జులై 10: ఫ్రెంచ్ ఫ్రాగ్స్ x ఇజ్రాయెల్ మాబోరత్
  • జులై 11: ఆస్ట్రియన్ రాక్స్ x ఇండియన్ టైగర్స్
  • జులై 12: స్పానిష్ చానోస్ x ఫ్రెంచ్ ఫ్రాగ్స్
  • జులై 18, 19: సెమీఫైనల్స్
  • జులై 25: మూడో స్థానం కోసం మ్యాచ్​
  • జులై 26: ఫైనల్

ABOUT THE AUTHOR

...view details