తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఈ ఏటి మేటి ఆటగాళ్లు... నీరజ్ చోప్రా, సింధు - సింధు

ఈ ఏటి మేటి ఆటగాళ్లుగా నీరజ్ చోప్రా (అథ్లెటిక్స్​), పీవీ సింధు (బ్యాడ్మింటన్)లు ఎంపికయ్యారు. 2018లో సత్తా చాటిన క్రీడాకారులకు అవార్డులు ప్రకటించింది ఈఎస్​పీఎన్ ఇండియా సంస్థ.

సింధు- నీరజ్

By

Published : Apr 5, 2019, 5:33 PM IST

ఈఎస్​పీఎన్ ఇండియా సంస్థ క్రీడా​ అవార్డులను ప్రకటించింది. 2018 సంవత్సరంలో వివిధ క్రీడాంశాల్లో సత్తా చాటిన భారత క్రీడాకారులను అవార్డులతో సత్కరించింది. పురుషుల్లో ఈ ఏటి మేటి ఆటగాడిగా 'జావెలిన్​ త్రో' ఆటగాడు నీరజ్​ చోప్రా ఎంపికయ్యాడు. మహిళల్లో బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు అవార్డు సాధించింది.

2018లో అద్భుత ప్రదర్శన చేసిన సింధు.. చివర్లో బీడబ్ల్యూఎఫ్​​ వరల్డ్​ టూర్​ ఫైనల్స్​ టైటిల్​ సాధించింది.ప్రపంచ ఛాంపియన్​ షిప్​లోనూ ఆకట్టుకునే ప్రదర్శన చేసింది. నీరజ్ చోప్రా ఆసియా, కామన్​వెల్త్​ క్రీడల్లో బంగారు పతకాన్ని గెలిచాడు. అంతే కాకుండా జావెలిన్​ త్రో లో 88.06 మీటర్ల దూరం బల్లెం విసిరి జాతీయ రికార్డు నమోదు చేశాడు. పునరాగమన క్రీడాకారిణిగా (కమ్ బ్యాక్ ఆఫ్​ ది ఇయర్) సైనా నెహ్వాల్ ​ఎంపికైంది.

ఈఎస్​పీఎన్ ఇండియా అవార్డులు

టీమ్ ఆఫ్ ది ఇయర్ (ఈ ఏటి మేటి జట్టు)గా భారత మహిళా టేబుల్ టెన్నిస్ జట్టు ఎంపికైంది. కామన్వెల్త్​ క్రీడల్లో బంగారు పతకం సాధించిందీ జట్టు. ప్రముఖ ఫుట్​బాల్ ఆటగాడు ప్రదీప్ కుమార్ బెనర్జీకి జీవన సాఫల్య పురస్కారం దక్కింది.

అవార్డు విజేతలు:

  • స్పోర్ట్స్​ పర్సన్ ఆఫ్ ది ఇయర్ పురుషుల్లో(ఈ ఏటి మేటి క్రీడాకారుడు).. నీరజ్ చోప్రా(అథ్లెటిక్స్)
  • స్పోర్ట్స్​ పర్సన్​ ఆఫ్ ది ఇయర్ మహిళల్లో(ఈ ఏటి మేటి క్రీడాకారిణి).. పీవీ సింధు(బ్యాడ్మింటన్)
  • కమ్ బ్యాక్ ఆఫ్ ది ఇయర్ (పునరాగమన క్రీడాకారిణి)....... సైనా నెహ్వాల్(బ్యాడ్మింటన్)
  • కోచ్ ఆఫ్ ది ఇయర్ (ఈ ఏటి మేటి శిక్షకుడు)........ జస్పాల్ రానా(షూటింగ్)
  • ఎమర్జింగ్ స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్​ ది ఇయర్............ సౌరభ్ చౌదరి (షూటింగ్)
  • టీమ్ ఆఫ్ ది ఇయర్ (ఈ ఏటి మేటి జట్టు)....... భారత మహిళల టేబుల్ టెన్నిస్ జట్టు
  • మ్యాచ్ ఆఫ్ ది ఇయర్............ అమిత్ పంగాల్- హసన్​బాయ్ దస్మాతోవ్ (బాక్సింగ్)
  • డిఫరెంట్లీ ఏబుల్డ్​ అథ్లెట్ ఆఫ్ ది ఇయర్........ ఏక్తా బ్యాన్ (పారా అథ్లెటిక్స్​)
  • మూమెంట్ ఆఫ్ ది ఇయర్......... మహిళల 4x400 మీటర్ల రిలే
  • జీవన సాఫల్య పురస్కారం................... ప్రదీప్ కుమార్ బెనర్జీ(ఫుట్​బాల్)

ABOUT THE AUTHOR

...view details