భారత మహిళా వెయిట్ లిఫ్టర్ సంజిత చానుపై ఉన్న డోపింగ్ మచ్చ తొలిగిపోయింది. దీంతో ఆమెకు నిలిపివేసిన 2018 నాటి అర్జున అవార్డును త్వరలోనే ప్రదానం చేయనున్నట్లు క్రీడా మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. దిల్లీ కోర్టు తీర్పు మేరకు ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలిపింది.
"సంజిత చానుపై ఉన్న డోపింగ్ ఆరోపణలను ఐడబ్ల్యూఎఫ్ ఉపసంహరించుకుంది. అందువల్ల 2018 దిల్లీ హైకోర్టు తీర్పు ప్రకారం సంజితకు అర్జున అవార్డు ప్రదానం చేస్తాం."