Dhiraj Bommadevara: ఆంధ్రప్రదేశ్ కుర్రాడు బొమ్మదేవర ధీరజ్ ఖాతాలో ఆసియా కప్ ఆర్చరీ స్వర్ణం చేరింది. వ్యక్తిగత విభాగంలో విఫలమైన ఈ కుర్రాడు జట్టు విభాగంలో మరో ఇద్దరితో కలిసి పసిడి గెలిచాడు. శనివారం రికర్వ్ టీమ్ ఫైనల్లో ధీరజ్, పార్థ్ సాలుంకే, రాహుల్‌తో కూడిన భారత బృందం 6-2లో కజకిస్థాన్‌ను ఓడించి పసిడి గెలుచుకుంది. ఇద్దరూ భారత ఆర్చర్లే తలపడిన మహిళల వ్యక్తిగత కాంపౌండ్ ఆఖరి సమరంలో సాక్షి చౌదరి స్వర్ణం గెలుచుకుంది. ఈ పోరులో సాక్షి-పర్ణీత్ కౌర్ చెరో 140 పాయింట్లు సాధించడంతో షూటాఫ్ నిర్వహించారు. అందులోనూ ఇద్దరూ 10 పాయింట్లు సాధించినా.. మధ్య స్థానానికి చేరువగా బాణాన్ని సంధించిన సాక్షి పసిడి కైవసం చేసుకుంది.
ఆసియా ఆర్చరీ కప్‌లో ధీరజ్ బృందానికి స్వర్ణం
Dhiraj Bommadevara: ఆసియా ఆర్చరీ కప్‌లో స్వర్ణం సాధించాడు ఆంధ్రప్రదేశ్ కుర్రాడు బొమ్మదేవర ధీరజ్. వ్యక్తిగత విభాగంలో విఫలమైన ఈ కుర్రాడు జట్టు విభాగంలో మరో ఇద్దరితో కలిసి పసిడి గెలిచాడు. శనివారం రికర్వ్ టీమ్ ఫైనల్లో ధీరజ్, పార్థ్ సాలుంకే, రాహుల్‌తో కూడిన భారత బృందం 6-2లో కజకిస్థాన్‌పై విజయం సాధించింది.
మహిళల రికర్వ్ బృందం కొద్దిలో స్వర్ణం చేజార్చుకుంది. ఫైనల్లో రిధి, త్రిష, తనీషాలతో కూడిన భారత జట్టు 4-5తో బంగ్లాదేశ్ చేతిలో ఓడింది. టైబ్రేకర్‌లో భారత్ ఒక్క పాయింట్ (27-28) తేడాతో పసిడి కోల్పోయింది. కాంపౌండ్ పురుషుల వ్యక్తిగత ఫైనల్లో రిషబ్ యాదవ్ రజతంతో సరిపెట్టుకున్నాడు. తుది పోరులో అతడు 126-145తో మహ్మద్ సలె (ఇరాన్) చేతిలో ఓడాడు. కాంపౌండ్ పురుషులు, మహిళల టీమ్ విభాగాల్లోనూ భారత్ పసిడి గెలవలేకపోయింది. పురుషుల ఆఖరి సమరంలో భారత్ (ప్రథమేశ్-ప్రియాంశ్) 232-233తో కజకిస్థాన్ చేతిలో ఓడగా.. మహిళల ఫైనల్లో భారత్ (సాక్షి-అదితి) 230-231తో థాయ్‌లాండ్ చేతిలో పరాజయం చవిచూసింది. మరో రెండు కాంస్య పతకాలు కూడా మన చేజారాయి. మహిళల రికర్వ్ వ్యక్తిగత విభాగంలో త్రిష పునియా 5-6తో నూర్ అమిర్ (మలేసియా) చేతిలో ఓడగా.. పురుషుల కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో ప్రథమేశ్ 147-147తో సయీద్ (ఇరాన్)తో టై అయ్యాడు. అయితే టైబ్రేకర్‌లో ప్రథమేశ్ ఓడిపోయాడు.
ఇదీ చదవండి:చరిత్ర సృష్టించిన లక్ష్యసేన్.. ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ ఫైనల్లోకి..