ప్రస్తుతం పోలీసు కస్టడీలో ఉన్న స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్‌కు 14 రోజులు రిమాండ్ విధిస్తూ దిల్లీ కోర్టు బుధవారం తీర్పిచ్చింది. మే 4న దిల్లీలోని ఛత్రసాల్ స్టేడియం వద్ద రెండు వర్గాల రెజ్లర్ల మధ్య జరిగిన కొట్లాటలో సాగర్ అనే 23 ఏళ్ల రెజ్లర్ మరణించాడు. సుశీల్ దాడి చేయడం వల్లే సాగర్ చనిపోయాడనే ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే అతడిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.
Sushil kumar: రెజ్లర్ సుశీల్‌కు 14 రోజులు రిమాండ్ - wrestler Sushil Kumar 14 days remand
హత్య కేసులో భాగంగా అరెస్టు అయిన రెజ్లర్ సుశీల్ కుమార్‌కు దిల్లీ న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. రెజ్లర్ సాగర్ మృతికి ఇతడే కారణమనే ఆరోపణలు వచ్చిన నేపథ్యంలోనే సుశీల్‌ను అరెస్టు చేశారు.
రెజ్లర్ సుశీల్ కుమార్