భారత స్టార్ రెజ్లర్, ప్రపంచ జూనియర్ ఛాంపియన్ దీపక్ పునియా.. టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు. కజకిస్థాన్ వేదికగా జరుగుతున్న ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్‌కు దూసుకెళ్లి ఈ ఘనత సాధించాడు. ఈ క్రీడలో దేశం తరఫున ఒలింపిక్స్ బెర్త్ ఖరారు చేసుకున్న నాలుగో ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఇప్పటికే వినేశ్ ఫొగాట్(53 కిలోలు), భజరంగ్ పునియా(65 కిలోలు), రవి కుమార్ దహియా(57 కిలోలు).. ఒలింపిక్స్‌కు అర్హత సాధించారు.
- ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో 86 కేజీల విభాగంలో పోటీ పడ్డాడు దీపక్. సెమీస్‌లో స్టెఫాన్ రీచ్ముత్పై(స్విట్జర్లాండ్)ను 8-2 తేడాతో ఓడించాడు
- మరో యువ రెజ్లర్ రాహుల్ అవారే 61 కేజీల నాన్ ఒలింపిక్ విభాగంలో సెమీఫైనల్లో అడుగుపెట్టాడు. క్వార్టర్స్‌లో ఆసియా క్రీడల మాజీ ఛాంపియన్ రసుల్ను 10-7 తేడాతో ఓడించాడు. తర్వాతి మ్యాచ్‌లో బెకో లామ్టేడ్(జార్జియా)తో తలపడనున్నాడు.