తెలంగాణ

telangana

ETV Bharat / sports

'దీపా ఒలింపిక్స్​ పర్యటనపై ఇప్పుడే ఏం చెప్పలేం'

భారత జిమ్నాస్టిక్స్​ సంచలనం దీపాకర్మాకర్ మోకాలి గాయం ఆందోళనకు గురిచేస్తోంది. ఇంక నయం కాకపోవడం వల్ల ఒలింపిక్స్​లో ఆడుతుందా లేదా అనే సందిగ్ధత నెలకొంది. ఆమె కోచ్ బిస్వేశ్వర్ నంది కూడా ఇప్పుడే ఏం చెప్పలేమని అంటున్నాడు.

By

Published : Jul 30, 2019, 7:00 AM IST

Updated : Jul 30, 2019, 12:12 PM IST

దీపా కర్మాకర్

2016 రియో ఒలింపిక్స్​లో తృటిలో కాంస్యాన్ని చేజార్చుకుంది భారత జిమ్నాస్టిక్​ క్రీడాకారిణి దీపాకర్మాకర్​. మోకాలి గాయం కారణంగా కీలక టోర్నీలకు దూరమైన దీపా ఒలింపిక్స్​లో ఆడుతుందా లేదా అనే దానిపై సర్వత్రా ఆందోళన నెలకొంది. ఈ విషయంపై ఇప్పుడే ఏం చెప్పలేమని అంటున్నారు దీపా కోచ్ బిస్వేశ్వర్ నంది.

"ప్రస్తుతానికి ఏం చేయలేని పరిస్థితుల్లో ఉన్నాం. వైద్యుల సలహా మేరకే ఏ నిర్ణయమైనా తీసుకోగలం. ఆమె పూర్తిగా కోలుకుంటే వైద్యులు, ఫిజియో సలహా తీసుకుని ఒలింపిక్స్​ భవితవ్యం గురించి చెబుతాను" -బిస్వేశ్వర్ నంది, దీపాకర్మాకర్ కోచ్​

దీపా పూర్తిగా ఎన్ని రోజుల్లో కోలుకుంటుందో చెప్పలేనని, అయితే ఇప్పుడే ఆశలు వదిలేసుకోలేదని అంటున్నాడు బిస్వేశ్వర్​ నంది.

"ఆమెకు ఎప్పుడు నయమవుతుందో ఇప్పుడే చెప్పలేను. ఇన్ని రోజులని సమయమంటూ లేదు. గాయానికి సంబంధించి చికిత్స కొనసాగుతోంది. అయితే మేము ఇప్పటికీ ఆశల్ని వదులుకోలేదు. దీపా ఆరోగ్య పరిస్థితిపై ఇదంతా ఆధారపడి ఉంది. ఒక్క శాతం ఆమెకు ప్రమాదముందని తెలిసినా.. మేము రిస్క్​ తీసుకోలేం" -బిస్వేశ్వర్ నంది, దీపాకర్మాకర్ కోచ్​

మార్చిలో జరిగిన బకు వరల్డ్​కప్​లో దీపా మోకాలికి గాయమైంది. అనంతరం కోలుకున్నా దోహా ప్రపంచకప్​లో రాణించలేకపోయింది. గత నెలలో మంగోలియాలో జరిగిన ఆసియా ఛాంపియన్​షిప్స్​లో గాయం తిరగబెట్టడం వల్ల మొత్తంగా టోర్నీకే దూరమైంది దీపా.

అక్టోబరు 4 నుంచి 13 వరకు జర్మనీలో ప్రపంచ ఛాంపియన్​షిప్స్​ జరగనున్నాయి. ఇందులో రాణిస్తే టోక్యో ఒలింపిక్స్​కు అర్హత సాధించే అవకాశముంది. ఈ పరిస్థితుల్లో దీపా గాయం అందరిని కలవరపెడుతోంది.

ఇది చదవండి: భారత్ పర్యటకులను ఆకర్షించేలా టీ 20 ప్రపంచకప్

Last Updated : Jul 30, 2019, 12:12 PM IST

ABOUT THE AUTHOR

...view details