చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్ రాబిన్ ఊతప్ప మరో బిడ్డకు తండ్రయ్యాడు. ఊతప్ప-శీతల్ దంపతులకు పండంటి ఆడబిడ్డ జన్మించింది. దీంతో ఊతప్ప ఆనందంలో మునిగితేలుతున్నాడు. చిన్నారికి పేరును కూడా పెట్టేశాడు.
'మా జీవితాల్లో అడుగుపెట్టిన దేవతను మీకు పరిచయం చేయడం ఆనందంగా ఉంది. 'ట్రినిటి థియా ఊతప్ప'.. మమ్మల్ని నీ తల్లిదండ్రులుగా ఎంచుకున్నందుకు గర్వపడుతున్నాం. నీకు అన్నయ్య అయినందుకు నీ సోదరుడు.. తల్లిదండ్రులమైనందుకు మేము.. ఆశీర్వాదంగా భావిస్తున్నాం' అని సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు ఊతప్ప.