తెలంగాణ

telangana

ETV Bharat / sports

బీచ్ హ్యాండ్​బాల్​లో బికినీ రూల్​కు చెల్లు - బీచ్ హ్యాండ్ బాల్​

బీచ్ హ్యాండ్​బాల్ పోటీల్లో ఇకపై మహిళలు బికినీ(beach handball women's uniform) ధరించడం తప్పనిసరి కాదు. ఇటీవల జరిగిన యూరోపియన్ బీచ్ హ్యాండ్​బాల్ ఛాంపియన్ షిప్​లో బికినీ ధరించలేదని నార్వే మహిళా జట్టుపై భారీ జరిమానా విధించారు. దీనిపై ఆ టీమ్ ఫిర్యాదు చేయగా.. ఆ నిబంధనను సవరిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

Bikini
బికినీ

By

Published : Nov 2, 2021, 9:20 AM IST

బీచ్​ హ్యాండ్​బాల్ క్రీడల్లో ఇకపై మహిళలు బికినీ(beach handball women's uniform) ధరించడం తప్పనిసరి కాదని హ్యాండ్​బాల్ క్రీడా సమాఖ్య స్పష్టం చేసింది. హ్యాండ్​బాల్ ఛాంపియన్ షిప్​లో బికినీ ధరించలేదని నార్వే మహిళల హ్యాండ్​బాల్​ జట్టు(beach handball bikini norway)కు యూరోపియన్​ హ్యాండ్​బాల్​ ఫెడరేషన్​ భారీ జరిమానా విధించింది. దీంతో దీనిపై ఫిర్యాదు చేసింది నార్వే. వీరికి మిగతా జట్లు మద్దతుగా నిలవగా.. మహిళలు బికినీ ధరించడం తప్పనిసరి కాదంటూ నిర్ణయం తీసుకున్నారు. వారికి నప్పిన దుస్తులు వేసుకునే వీలు కల్పించింది.

ఏం జరిగింది?

బల్గేరియాలోని వర్నాలో ఇటీవలే యూరోపియన్​ బీచ్​ హ్యాండ్​బాల్​ ఛాంపియన్​షిప్​ జరిగింది. ఆ టోర్నీలో పాల్గొన్న నార్వే మహిళలు హ్యాండ్​బాల్​ జట్టు(beach handball bikini norway).. రూల్స్​కు వ్యతిరేకంగా బికినీ స్థానంలో షార్ట్స్(beach handball women's uniform) ధరించి బరిలో దిగారు. దీంతో సదరు టీమ్​పై ఆగ్రహించిన యూరోపియన్​ హ్యాండ్​బాల్​ సమాఖ్య భారీ జరిమానా విధించింది. 1500 యూరోలు పరిహారంగా కట్టాలని ఆదేశించింది.

నార్వే మహిళల జట్టు

ఆ రూల్ ఏంటి?

అంతర్జాతీయ హ్యాండ్​బాల్​ సమాఖ్య నిబంధనల ప్రకారం మహిళా అథ్లెట్లు తప్పనిసరిగా బాటమ్​ బికినీ(beach handball bikini uniform) ధరించాలి. సైడ్స్​లో బికినీ సైజ్​ నాలుగు అంగుళాలను మించకూడదు. అదే విధంగా పురుష అథ్లెట్లు మోకాలికి నాలుగు అంగుళాల పైకి షార్ట్స్​ వేసుకునే వెసులుబాటు ఉంది. దీనిపై క్రీడాకారిణుల నుంచి విముఖత వ్యక్తమవగా.. ఈ రూల్​ను సవరించింది హ్యాండ్​బాల్ సమాఖ్య.

బికినీతో క్రీడాకారిణులు

ఇవీ చూడండి: ఐపీఎల్ వల్లే టీమ్ఇండియాకు వైఫల్యాలా?

ABOUT THE AUTHOR

...view details