అర్జెంటీనా దిగ్గజం లియోనెల్ మెస్సికి ఉండే ఆదరణ ఎలాంటిదో మరోసారి వెల్లడైంది. ఆదివారం అర్జెంటీనా, మెక్సికో జట్ల మధ్య మ్యాచ్‌ను అభిమానం ముంచెత్తింది. గత 28 ఏళ్ల ప్రపంచకప్ చరిత్రలో అత్యధికంగా ప్రేక్షకులు ఉత్తర దోహాలోని లుసైల్ స్టేడియానికి పోటెత్తారు. అర్జెంటీనా 2-0తో మెక్సికోను చిత్తుచేసిన ఈ మ్యాచ్‌ను 88,966 మంది ప్రేక్షకులు ప్రత్యక్షంగా వీక్షించారు. ప్రపంచకప్‌లో ఓ మ్యాచ్‌కు గత 28 ఏళ్లలో అత్యధిక ప్రేక్షకుల సంఖ్య ఇదే.
మెస్సీ మ్యాచ్‌కు 88వేల మంది ఫ్యాన్స్.. 28 ఏళ్ల చరిత్రలో తొలిసారిగా..
ఫిఫా వరల్డ్‌కప్‌లో భాగంగా ఆదివారం అర్జెంటీనా, మెక్సికో జట్ల మధ్య మ్యాచ్‌ను అభిమానం ముంచెత్తింది. గత 28 ఏళ్ల ప్రపంచకప్ చరిత్రలో అత్యధికంగా ప్రేక్షకులు ఉత్తర దోహాలోని లుసైల్ స్టేడియానికి పోటెత్తారు.
mesii
1994లో అమెరికా ఆతిథ్యమిచ్చిన ప్రపంచకప్‌లో బ్రెజిల్, ఇటలీ మధ్య ఫైనల్‌ను 91,194 మంది ప్రేక్షకులు వీక్షించారు. ఆ మ్యాచ్‌లో పెనాల్టీ షూటౌట్‌లో ఇటలీపై బ్రెజిల్ గెలిచింది. 1950లో రియో డి జెనీరో లోని మారాకాన స్టేడియంలో ఉరుగ్వే, బ్రెజిల్ మధ్య ఫైనల్‌ను అత్యధికంగా 1,73,850 మంది ప్రేక్షకులు చూశారు. ఫుట్‌బాల్ చరిత్రలో అత్యధిక ప్రేక్షకుల సంఖ్య ఇదే. ఆ మ్యాచ్‌లో ఉరుగ్వే 2-1తో ఆతిథ్య బ్రెజిల్‌పై విజయం సాధించింది.