తెలంగాణ

telangana

ETV Bharat / sports

వివాహబంధంతో ఒక్కటి కానున్న మల్లయోధులు - bajarang poniya

ప్రముఖ మల్లయోధులు బజరంగ్ పునియా, సంగీత ఫోగాట్​ త్వరలో వివాహబంధంతో ఒక్కటి కానున్నారు. ఈ విషయాన్ని ఇరువురి కుటుంబాలు ధ్రువీకరించాయి.

పూనియా

By

Published : Aug 9, 2019, 7:46 AM IST

ప్రపంచ నంబర్​వన్‌ మల్లయోధుడు బజరంగ్‌ పునియా, అంతర్జాతీయ స్థాయి మల్లయోధురాలు సంగీతా ఫోగాట్‌ త్వరలో వివాహ బంధంతో ఒక్కటి కానున్నారు. ఇరువురి కుటుంబాలు ఈ విషయాన్ని ధ్రువీకరించాయి. 2020 టోక్యో ఒలింపిక్స్‌ ముగిసిన తర్వాత వీరి వివాహం జరగనుంది.

పునియా ప్రపంచస్థాయి కుస్తీ ర్యాంకింగ్స్‌- 65 కేజీల విభాగంలో అగ్రస్థానంలో కొనసాగుతుండగా, సంగీతా ఫోగాట్‌ మహిళల 59 కేజీల విభాగంలో జాతీయస్ధాయిలో విజేతగా నిలిచింది.

పిల్లల అభిప్రాయాన్ని తాము గౌరవిస్తున్నామని అన్నాడు సంగీతా ఫోగాట్‌ తండ్రి, ఒకప్పటి మల్లయోధుడు మహావీర్‌సింగ్‌. 2010 కామన్‌వెల్త్‌ గేమ్స్‌ కుస్తీపోటీల్లో బంగారుపతక విజేత గీతాఫోగాట్‌... సంగీతా ఫోగాట్‌కు సోదరి. ఆమె కూడా పవన్‌కుమార్‌ అనే మల్లయోధుడిని 2016లో వివాహం చేసుకుంది. ఇద్దరు కూతుళ్లను అంతర్జాతీయ స్థాయిలో మల్లయోధులుగా తీర్చిదిద్దిన వారి తండ్రి మహావీర్‌సింగ్‌ జీవితం ఆధారంగానే అమీర్‌ఖాన్‌ ముఖ్యపాత్ర పోషించిన 'దంగల్‌' సినిమా తెరకెక్కింది.

ABOUT THE AUTHOR

...view details