badminton asia championships: ప్రపంచ బ్యాడ్మింటన్‌లో అత్యంత పోటీ ఉండే ఆసియా ఛాంపియన్‌షిప్‌లో అద్వితీయ ఆటతీరుతో సెమీఫైనల్లోకి దూసుకెళ్లిన పీవీ సింధు.. నిరాశ పరిచింది. సెమీస్‌లో ఓడి కాంస్యంతో సరిపెట్టుకుంది. కీలకమైన సెమీ ఫైనల్లో టాప్ సీడ్ అకానె యమగూచి (జపాన్) చేతిలో 21-13, 19-21, 16-21 తేడాతో ఓటమిపాలైంది.
ఆసియా ఛాంపియన్‌షిప్ సెమీస్‌లో సింధు ఓటమి.. కాంస్యంతో సరి - పీవీ సింధు బ్యాడ్మింటన్
badminton asia championships: ఆసియా ఛాంపియన్‌షిప్‌లో పీవీ సింధు పతకం దక్కించుకుంది. టోర్నీ సెమీ ఫైనల్లో ఓటమిపాలైన సింధు.. కాంస్యంతో సరిపెట్టుకుంది.
PV SINDHU
PV sindhu badminton medal: కాగా, ఈ ఆసియా ఛాంపియన్‌షిప్ టోర్నీల్లో సింధుకు ఇది రెండో పతకం కావడం విశేషం. 2014లో జిమ్‌చన్ (దక్షిణ కొరియా) షట్లర్‌పై తొలిసారి కాంస్య పతకం కైవసం చేసుకుంది. సైనా నెహ్వాల్ (2010 దిల్లీ, 2016 వుహాన్, 2018 వుహాన్) సైతం గతంలో ఈ పోటీల్లో మూడుసార్లు కాంస్యంతోనే సరిపెట్టుకుంది.
ఇదీ చదవండి:పీవీ సింధు.. బ్యాడ్మింటన్‌లోనే కాదు ఆ విషయంలోనూ టాపే!