Beijing Olympics boycott: అమెరికా బాటలోనే.. 2022 బీజింగ్ వింటర్ ఒలింపిక్స్‌ను దౌత్యపరంగా బహిష్కరించాయి ఆస్ట్రేలియా, యునైటెడ్ కింగ్డమ్, కెనడా. ఈ మేరకు ఆయా దేశాధినేతలు ప్రకటనలు చేశారు. అగ్రరాజ్యం తరహాలోనే తమ దేశ అథ్లెట్లు ఒలింపిక్స్‌లో పాల్గొంటారని, కానీ ప్రభుత్వ అధికారులను మాత్రం చైనాకు పంపమని ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ ప్రకటించారు. చైనాలో మానవ హక్కుల ఉల్లంఘనపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
అనంతరం యూకే, కెనడా కూడా తమ దౌత్యవేత్తలు, అధికారులు క్రీడలకు హాజరుకారని ప్రకటించాయి. చైనా ప్రభుత్వం పదేపదే మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడటాన్ని తాము తీవ్రంగా పరిగణిస్తున్నట్లు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తెలిపారు.