తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఈ వేలంలో ఒలింపిక్స్ విజేతల వస్తువులు.. రికార్డు ధరే లక్ష్యంగా! - పీవీ సింధు రాకెట్ ఈ వేలం

ప్రధాని నరేంద్రమోదీ(e auction of pm gifts) పుట్టినరోజును పురస్కరించుకుని.. టోక్యో ఒలింపిక్స్, పారాలింపిక్స్​లో పతకాలు గెలిచిన క్రీడాకారులకు సంబంధించిన పరికరాలు, దుస్తులను వేలానికి ఉంచారు. ప్రస్తుతం ఇవి రికార్డు ధరతో దూసుకెళ్తున్నాయి. అక్టోబర్ 7 వరకు ఈ వేలం కొనసాగనుంది.

neerzj
నీరజ్

By

Published : Sep 17, 2021, 6:16 PM IST

ప్రధాని నరేంద్రమోదీ పుట్టినరోజును పురస్కరించుకుని.. వివిధ సందర్భాలు, పర్యటనల్లో ఆయనకు బహుమతులుగా అందిన వస్తువుల ఈ-వేలం(e auction of pm gifts) శుక్రవారం ప్రారంభమైంది. ఇందులో టోక్యో ఒలింపిక్స్‌, పారాలింపిక్స్‌లో పతకాలు సాధించిన క్రీడాకారుల పరికరాలు, దుస్తులను కూడా వేలానికి ఉంచారు.

రూ.90లక్షలు దాటిన సింధు రాకెట్‌..

ఇక టోక్యో ఒలింపిక్స్‌లో దేశానికి తొలి స్వర్ణం అందించిన జావెలిన్‌ త్రో ఆటగాడు నీరజ్‌ చోప్రా(neeraj chopra olympics) ఉపయోగించిన ఈటెను రూ.కోటి బేస్‌ ధరతో వేలానికి పెట్టగా.. ప్రస్తుతం రూ.1.50కోట్లతో కొనసాగుతోంది. ఒలింపిక్స్‌లో వరుసగా రెండు పతకాలు సాధించిన ఏకైక మహిళగా చరిత్ర సృష్టించిన తెలుగు తేజం పీవీ సింధు(pv sindhu in tokyo olympics) రాకెట్‌కు రూ.80లక్షల బేస్‌ధరతో వేలం నిర్వహిస్తుండగా.. ప్రస్తుతం దాని ధర రూ.90లక్షలు దాటింది. టోక్యో ఒలింపిక్స్‌లో బాక్సింగ్‌ సంచలనం లవ్లీనా బోర్గొహేన్‌(lavleena tokyo olympics medal) చేతి గ్లౌజులను రూ. 80లక్షలతో వేలం ప్రారంభించగా.. ప్రస్తుత ధర రూ.1.92కోట్లుగా ఉంది.

కేంద్ర సాంస్కృతిక శాఖ pmmementos.gov.inలో ఈ వేలాన్ని నిర్వహిస్తోంది. సెప్టెంబరు 17 నుంచి వచ్చే నెల ఏడో తేదీ వరకు ఈ వేలం కొనసాగనుంది. వేలం పూర్తయిన తర్వాత అత్యధిక ధరతో బిడ్‌ వేసిన వారికి ఈ-మెయిల్‌ ద్వారా సమాచారం ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా సమకూరిన నిధులను గంగా నది ప్రక్షాళన కోసం చేపట్టిన నమామి గంగే కార్యక్రమం కోసం వెచ్చించనున్నారు.

ఇవీ చూడండి: ఆర్సీబీ కెప్టెన్సీ నుంచి కోహ్లీ తప్పుకోనున్నాడా?

ABOUT THE AUTHOR

...view details