Asian Rowing Championships 2021: ఆసియా రోయింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత రోయర్లు అర్జున్ లాల్-రవి సత్తా చాటారు. పురుషుల డబుల్స్ స్కల్స్‌లో వీరు స్వర్ణం గెలుచుకున్నారు. శనివారం జరిగిన రేసులో అర్జున్-రవి జంట 6 నిమిషాల 57.8 సెకన్లలో లక్ష్యాన్ని చేరి అగ్రస్థానంలో నిలిచింది. ఈ క్రమంలో భారత ద్వయం చైనా జంట క్వింగ్ లీ-జాంగ్ (7 నిమిషాల 2.37 సెకన్లు), ఉజ్బెకిస్థాన్ ద్వయం దారోనోవ్-ముక్‌మదెవ్ (7 నిమిషాల 7.73 సెకన్లు)లను వెనక్కి నెట్టింది.
ఆసియా రోయింగ్‌లో స్వర్ణంతో మెరిసిన భారత జోడీ - ఆసియా రోయింగ్ ఛాంపియన్ షిప్ భారత పతకాలు
Asian Rowing Championships 2021: ఆసియా రోయింగ్ ఛాంపియన్ షిప్ పురుషుల డబుల్స్ విభాగంలో భారత రోయర్లు అర్జున్ లాల్-రవి స్వర్ణం కైవసం చేసుకున్నారు. సింగిల్ స్కల్స్‌లో పర్మీందర్ సింగ్ రజతం గెలిచాడు.
Arjun Lal Jat Ravi
అలాగే, సింగిల్ స్కల్స్‌లో పర్మీందర్ సింగ్ రజతం గెలిచాడు. ఫైనల్లో పర్మీందర్ 8 నిమిషాల 7.32 సెకన్లలో లక్ష్యాన్ని అందుకుని రెండో స్థానంలో నిలిచాడు. షఖ్‌బోజ్ (ఉజ్బెకిస్థాన్, 7 నిమిషాల 56.3 సెకన్లు) స్వర్ణం కైవసం చేసుకున్నాడు. శనివారం భారత రోయర్లు మరో ఐదు ఫైనల్స్‌లో బరిలో దిగే నేపథ్యంలో మన ఖాతాలో మరిన్ని పతకాలు చేరే అవకాశాలున్నాయి.