Asian Champions Trophy 2023 : ఆసియా ఛాంపియన్ ట్రోఫీ చరిత్రలో భారత హాకీ టీమ్ నాలుగోసారి విజేతగా నిలిచింది. చెన్నై వేదికగా శనివారం మలేసియాతో జరిగిన ఫైనల్స్‌లో భారత్ 4 - 3 తేడాతో విజయాన్ని తన ఖాతాలోకి వేసుకుంది. ఈ క్రమంలో ట్రోఫీ గెలిచిన భారత ఆటగాళ్లపై ప్రశంసల జల్లుతో పాటు కానుకల వర్షం కురుస్తోంది.
హాకీ ఇండియా అధ్యక్షుడు డాక్టర్ దిలీప్ టిర్కే.. భారత జట్టు ఆటగాళ్లతో పాటు, సిబ్బందికి కూడా నజరానా ప్రకటించారు. ప్రతి ప్లేయర్‌కు రూ. 3 లక్షలు, సహాయక సిబ్బందికి రూ. 1.5 లక్షలు ఇస్తున్నట్లు తెలిపారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కూడా నజరానా ఇవ్వనున్నట్లు తెలిపారు. ఆసియా ఛాంపియన్షిప్స్ 2023 హాకీ విభాగంలో విజేతగా నిలిచిన హర్మన్‌ప్రీత్ సింగ్ జట్టుకు రూ 1.1 కోట్ల నజరానాను ప్రకటించారు. మరోవైపు ఈ టోర్నమెంట్లో పలువురు టీమ్ మెంబర్స్ పలు ప్రతిష్టాత్మక అవార్డులను దక్కించుకున్నారు.. అవేంటంటే..
Asian Champions Trophy Awards :ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డు :ఆరు మ్యాచ్‌ల్లో రెండు గోల్స్‌తో సత్తా చాటిన పాకిస్థాన్ ఆటగాడు అబ్దుల్ షాహిద్ 'ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డు' దక్కించుకున్నాడు.
బెస్ట్ గోల్ కీపర్ ఆఫ్ ది టోర్నమెంట్ : సౌత్ కొరియా ఆటగాడు కిమ్ జేహియోన్ 'బెస్ట్ గోల్ కీపర్ ఆఫ్ ది టోర్నమెంట్' అవార్డును సొంతం చేసుకున్నాడు. అయితే ఈ టోర్నీలో సౌత్ కొరియా టీమ్.. నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది.
ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ : ఏడు మ్యాచ్‌ల్లో మూడు గోల్స్‌చేసి.. ప్రత్యర్థులను కట్టడి చేసిన భారత ఆల్‌రౌండర్ మన్‌దీప్ సింగ్‌ను 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్' అవార్డు వరించింది.