తెలంగాణ

telangana

ETV Bharat / sports

కరెన్సీపై మెస్సీ ఫొటో.. ఆ దేశం కీలక నిర్ణయం! - ఫిఫా వరల్డ్​ కప్​ లియోనెల్​ మెస్సీ

మెస్సీ ప్రభంజన ఇంకా కొనసాగుతూనే ఉంది. ప్రపంచ వ్యాప్తంగా సెలెబ్రేషన్స్​ కొనసాగుతున్నాయి. ఇప్పుడు మరో వార్త అతడి అభిమానులను ఆనందంలో ముంచెత్తుతోంది. అర్జెంటీనా కరెన్సీపై మెస్సీ ఫొటో ముద్రించబోతున్నారట. ఈ మేరకు సోషల్​ మీడియాలో ఫొటోలు చక్కర్లు కొడుతున్నాయి. ఇంతకీ విషయం ఏంటంటే..

Etv Bharat
Etv Bharat

By

Published : Dec 22, 2022, 8:33 PM IST

ఫిఫా ప్రపంచకప్ ఫైనల్​ ముగిసినా.. దాని ఫీవర్​ ఇంకా అలాగే ఉంది. సెలెబ్రేషన్స్​ ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఇక మెస్సీ పేరు మారుమోగిపోతూనే ఉంది. తాజాగా మెస్సీ గురించి మరో వార్త సంచలనంగా మారింది. సుదీర్ఘ కాలం తర్వాత తమ దేశానికి ఫిపా వరల్డ్​ కప్‌ను అందించిన లియోనల్‌ మెస్సీ ఫొటోను తమ దేశ 1000 పెసో (అర్జెంటీనా కరెన్సీ) నోట్లపై ముద్రించేందుకు నిర్ణయం తీసుకుందట! ఈ మేరకు ఈ విషయాన్ని ఆ దేశ దినపత్రిక ఎల్‌ ఫినాన్సియరో రాసుకొచ్చింది. ఫిఫా వరల్డ్‌కప్‌ విజయానికి గుర్తుగా అర్జెంటీనా సెంట్రల్‌ బ్యాంక్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. కాగా, ఈ విషయాన్ని మిగతా పత్రికలు కొట్టిపారేశాయి.

కరెన్సీపై మెస్సీ ఫొటో

ఫిఫా ఫైనల్​ ముగియక ముందు నుంచే ఈ రకంగా అర్జెంటీనా సెంట్రల్​ బ్యాంక్​ సన్నాహాలు చేసిందని పత్రిక పేర్కొంది. దీంతో అర్జెంటీనా కరెన్సీపై మెస్సీ ఫొటోతో సోషల్​ మీడియాలో వైరల్​ అయ్యింది. అయితే ఇదంతా జోక్​లాగానే సెంట్రల్​ బ్యాంక్​కు సూచించాం అని ఆ పత్రిక చెప్పుకొచ్చింది. దీనిపై స్పందించిన బ్యాంకు డైరెక్టర్లలో ఒకరు లిసాండో క్లేరీ.. అది మంచి ఆలోచనే అని చెప్పారని పత్రిక పేర్కొంది. అయితే ఇలా చేయడం మొదటి సారి కాదు. అర్జెంటీనా 1978లో మొదటి వరల్డ్​ కప్​ గెలిచిన తర్వాత కూడా స్మారక నాణేలు విడుదల చేశారు. ఇక ఫిఫా ఫైనల్​లో మెస్సీ అధ్భుత ప్రదర్శన చేశాడు. దీంతో షూటౌట్​లో ఫ్రాన్స్‌పై 4-2 గోల్స్‌ తేడాతో గెలిచి మూడోసారి జగజ్జేతగా నిలిచింది అర్జెంటీనా

ABOUT THE AUTHOR

...view details