భారత్‌లో ఆగస్టు 29వ తేదీని జాతీయ క్రీడా దినోత్సవంగా నిర్వహిస్తుంది ప్రభుత్వం. భారత హాకీ దిగ్గజం ధ్యాన్ చంద్ పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఏటా ఈ వేడుకను జరుపుకుంటాం. 1905లో ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్‌లో పుట్టిన ఆయన.. ఒలింపిక్స్‌లో భారత్‌కు మూడు బంగారు పతకాలు (1928, 1932, 1936) తెచ్చాడు. 22 ఏళ్ల కెరీర్లో 400 గోల్స్ సాధించాడు. ధ్యాన్‌చంద్ క్రీడారంగంలో చేసిన కృషికి గుర్తుగా ఈ రోజున క్రీడాకారులకు అవార్డులు అందజేస్తారు. క్రీడల్లో దేశానికి పేరు తెచ్చిన ఆటగాళ్లకు రాష్ట్రపతి పురస్కారాలు ప్రదానం చేస్తారు.
1. ఖేల్ రత్న
క్రీడారంగంలో అత్యున్నత భారతీయ పురస్కారం రాజీవ్‌గాంధీ ఖేల్ రత్న. మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ జ్ఞాపకార్థం 1991-92లో ఈ అవార్డును ఇవ్వడం ప్రారంభించారు. ఒలింపిక్స్, ఆసియా, కామన్వెల్త్ క్రీడలు వంటి పలు అంతర్జాతీయ టోర్నీల్లో.. నాలుగేళ్ల కాలంలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన క్రీడాకారులకు వ్యక్తిగత, బృంద విభాగంలో ఈ అవార్డు అందజేస్తారు. పురస్కారంతో పాటు మెడల్, ప్రశంసాపత్రం, రూ. 7.5 లక్షల నగదు బహుకరిస్తారు. చెస్ గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ మొదటి అవార్డు స్వీకరించాడు.
2. అర్జున అవార్డు
క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన వారిని గుర్తించడానికి యువజన, క్రీడా వ్యవహారాల మంత్రిత్వ శాఖ 1961 నుంచి అర్జున అవార్డు ప్రదానం చేస్తోంది. పురస్కార గ్రహీతలను అర్జునుడి కాంస్య విగ్రహం, ప్రశంసాపత్రం, రూ. 5 లక్షల నగదుతో సత్కరిస్తారు. నాలుగేళ్ల కాలంలో క్రీడల్లో ప్రతిభ చూపించడమే కాకుండా క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు కలిగిని వారిని ఈ అవార్డుకు ఎంపిక చేస్తారు.
3. ద్రోణాచార్య అవార్డు
అంతర్జాతీయ స్థాయిలో పతక విజేతలను తయారుచేసిన ఉత్తమ క్రీడా శిక్షకులకు ఈ అవార్డు ఇస్తారు. 1985 నుంచి ద్రోణాచార్య అవార్డును ప్రదానం చేస్తున్నారు. విజేతలకు ద్రోణాచార్య విగ్రహం, ప్రశంసాపత్రం, రూ.7 లక్షల నగదును బహుకరిస్తారు. ప్రతి ఏటా ఈ అవార్డు అందజేస్తారు.
4. ధ్యాన్‌చంద్ అవార్డు