జమైకా చిరుత ఉసేన్ బోల్ట్ రికార్డు బ్రేక్ చేయడం సాధ్యమా? అయితే తొమ్మిదేళ్ల పాటు అథ్లెటిక్స్‌లో తన హవాను కొనసాగించిన బోల్ట్ రికార్డు బద్దలైంది. ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో 12 స్వర్ణాలు దక్కించుకుని బోల్ట్‌ను వెనక్కినెట్టింది అమెరికాకు చెందిన అలిసన్ ఫెలిక్స్. జమైకా చిరుత 11 స్వర్ణాలతో ఆమె తర్వాత స్థానంలో ఉన్నాడు.
దోహా వేదికగా జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 4X400 మిక్స్డ్ రిలేలో స్వర్ణ పతకంతో బోల్ట్‌ను అధిగమించింది అలిసన్. అమెరికా మిక్స్డ్ రిలే జట్టు 3 నిమిషాల 9.34 సెకన్లలో పరుగును పూర్తి చేసి ప్రపంచ రికార్డు నెలకొల్పింది. ఈ పోటీలో భారత జట్టు ఏడో స్థానంలో నిలిచి పతకం సాధించడంలో విఫలమైంది.