Commonwealth Games Weightlifting: కామన్వెల్త్ క్రీడల్లో భారత్‌కు మూడో స్వర్ణాన్ని సాధించి పెట్టాడు వెయిట్‌లిఫ్టర్ అజయ్ సింగ్. తాష్కెంట్లో సోమవారం జరిగిన ఫైనల్లో 81 కేజీల విభాగంలో విజేతగా నిలిచాడు. దీంతో 2022 బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ క్రీడలకు నేరుగా అర్హత సాధించాడు అజయ్. ఫైనల్లో ఏకంగా 322 కిలోలను (147, 175) లిఫ్ట్ చేశాడు అజయ్. స్నాచ్‌లో 147కిలోలతో జాతీయ రికార్డు నెలకొల్పాడు.
వచ్చే ఏడాది జరగనున్న కామన్వెల్త్ క్రీడలకు నేరుగా అర్హత పొందిన మూడో భారత వెయిట్‌లిఫ్టర్ అజయ్. అతడి కన్నా ముందు జెరెమీ (67కేజీ), అచింతా (73 కేజీ) అర్హత సాధించారు.