Adhoc Committee For WFI :డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడు సంజయ్ సింగ్తో పాటు ఆయ కార్యవర్గ బృందానికి తాజాగా క్రీడా మంత్రిత్వ శాఖ షాకిచ్చింది. అయితే తాజా సమాచారం ప్రకారం ఇకపై డబ్ల్యూఎఫ్‌ఐ వ్యవహారాలను నిర్వహించడానికి ఓ తాత్కాలిక కమిటీని ఏర్పాటు చేయాలంటూ భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ)ని కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ కోరిందట. ఇందులో భాగంగా ఇకైపై రెజ్లింగ్ ఫెడరేషన్ బాధ్యతలను ఆ తాత్కాలిక కమిటీ చూసుకోవాలంటూ ఐఓఏకు క్రీడా శాఖ లేఖ రాసింది.
Sakshi Malik WFI Suspension :మరోవైపు తాజాగా ఈ విషయంపై స్టార్ రెజ్లర్ సాక్షి మాలిక్ స్పందించింది. ఇప్పటి వరకు ఈ విషయంపై ఎటువంటి క్లారిటీ రాలేదని అయితే మా పోరాటం మహిళా ప్లేయర్ల కోసమే అని చెప్పుకొచ్చింది.
"ఇంకా ఈ విషయంపై అధికారిక సమాచారం ఏమీ రాలేదు. సంజయ్ సింగ్‌ను మాత్రమే సస్పెండ్ చేశారా లేదా మొత్తం కార్య వర్గాన్ని సస్పెండ్ చేశారా అన్న విషయం కూడా నాకు తెలియదు. ప్రభుత్వంతో మాకు ఎటువంటి విభేదాలు లేవు. మా పోరాటం మహిళా రెజ్లర్ల కోసం మాత్రమే. నేను రిటైర్మెంట్ ప్రకటించాను. కానీ ఇకపై ఈ ఫీల్డ్లోకి రానున్న రెజ్లర్లకు న్యాయం జరగాలని నేను కోరుకుంటున్నాను" అంటూ సాక్షి మాలిక్ స్పందించింది.