తెలంగాణ

telangana

ETV Bharat / sports

క్షణాల్లో ముగిసే రెజ్లింగ్​ బౌట్​.. 11 గంటలు జరిగితే.. - sports news latest

ఒలింపిక్స్ గురించి సరికొత్త విశేషాలు మీకోసం తీసుకొచ్చేశాం. 1912 ఒలింపిక్స్​లో జరిగిన, చోటు చేసుకున్న ఆసక్తికర సంఘటనల సమాహారమే ఈ స్టోరీ.

1912 olympics fun facts
1912 ఒలింపిక్స్ విశేషాలు

By

Published : Jul 17, 2021, 2:30 PM IST

Updated : Jul 17, 2021, 3:29 PM IST

సాధారణంగా నిమిషాల్లో పూర్తయ్యే రెజ్లింగ్ బౌట్.. 1912 ఒలింపిక్స్​లో దాదాపు 11 గంటలు పాటు సాగింది. అంతసేపు రెజ్లర్లు తలపడ్డారా అని ఆశ్చర్యపోవద్దు. ఇది నిజ్జంగా నిజం. అలానే రన్నింగ్​లో ఆటోమెటిక్ టైమింగ్ పరికరాల్ని.. ఈ ఒలింపిక్స్​లోనే ప్రవేశపెట్టారు.

1912 స్టాక్​హోమ్(స్వీడన్​)​ ఒలింపిక్స్

  1. ఈ ఒలింపిక్స్​లో దాదాపు 2400 మంది అథ్లెట్లు పాల్గొన్నారు. 28 దేశాల నుంచి హాజరైన వీరిలో 48 మంది మహిళలు హాజరయ్యారు. మొత్తంగా 14 క్రీడల్లో 102 ఈవెంట్లు నిర్వహించారు.
  2. పూర్తిగా బంగారంతో చేసిన పతకాలను.. ఈ ఒలింపిక్స్​లోనే చివరిసారిగా ఇచ్చారు.
  3. ట్రాక్ ఈవెంట్స్​లో ఆటోమెటిక్​ టైమింగ్ పరికరాలను ఈ ఒలింపిక్స్​తోనే ప్రవేశపెట్టారు.
  4. ఈ ఒలింపిక్స్​లో మిడిల్​వెయిట్​ రెజ్లింగ్ సెమీఫైనల్​లో ఆల్ఫ్రెడ్​ అసికైనెన్(ఫిన్లాండ్)- మార్టిన్ క్లెయిన్​(రష్యా).. దాదాపు 11 గంటలు తలపడ్డారు. ఇందులో క్లెయిన్​ గెలిచినప్పటికీ, బాగా అలసిపోవడం వల్ల ఫైనల్​ ఆడలేకపోయాడు. దీంతో రజత పతకంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
  5. ఒలింపిక్స్​ చరిత్రలోనే అత్యధికంగా 320 కిలోమీటర్లు ఉన్న సైక్లింగ్ రోడ్​ను 1912లో రూపొందించడం విశేషం.
  6. ఆర్ట్ కాంపిటీషన్స్, మహిళల డైవింగ్, స్విమ్మింగ్​ పోటీలతో పాటు డెకాథ్లాన్, పెంటథ్లాన్​లో మహిళలు ఆడటం ఈ ఒలింపిక్స్​తోనే మొదలైంది.
  7. స్వీడన్​లో అంతగా ప్రజాదరణ పొందని కారణంగా.. బాక్సింగ్​ను 1912 ఒలింపిక్స్​లో తొలగించారు.
  8. క్రీడాకారులు ఐదు ఖండాల నుంచి పోటీల్లో భాగస్వామ్యం కావడం ఇదే తొలిసారి. ఈ ఐదు ఖండాలు.. ఒలింపిక్స్​ లోగోలోని ఐదు రింగులను సూచిస్తాయి.

ఇవీ చదవండి:

Last Updated : Jul 17, 2021, 3:29 PM IST

ABOUT THE AUTHOR

...view details