దేశంలో అతిపెద్ద హాకీ స్టేడియం పనులు ప్రారంభమయ్యాయి. శుక్రవారం నుంచి నిర్మాణానికి సంబంధించిన కార్యక్రమాలు మొదలయ్యాయి. బిజుపట్నాయక్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీలో నిర్మితమవుతున్న ఈ స్టేడియం శంకుస్థాపనను ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, ఫిబ్రవరిలోనే చేశారు. కానీ కరోనా వల్ల పని ఆలస్యమైంది.
HOCKEY: అతిపెద్ద హాకీ స్టేడియం నిర్మాణం షురూ - హాకీ న్యూస్
మన దేశంలోనే అతిపెద్ద హాకీ స్టేడియం నిర్మాణం ప్రారంభమైంది. 2023 హాకీ ప్రపంచకప్.. ఇందులో నిర్వహించనున్నారు.
హాకీ స్టేడియం
ఏడాదిలో దాదాపు ఈ స్టేడియం నిర్మాణాన్ని పూర్తి చేసి, 2023 హాకీ ప్రపంచకప్ కల్లా పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని ఒడిశా ప్రభుత్వం భావిస్తోంది. 15 ఎకరాల్లో 20 వేల సీటింగ్ సామర్థ్యంతో ఈ స్టేడియాన్ని రూపొందిస్తున్నారు.