ఐరోపా పర్యటనను భారత హాకీ జట్టు అజేయంగా ముగించింది. తన చివరి మ్యాచ్‌లో 3-2తో బ్రిటన్‌పై విజయం సాధించింది. భారత్ తరఫున మన్దీప్ సింగ్ రెండు గోల్స్ (28వ, 59వ నిమిషాల్లో) కొట్టగా.. హర్మన్ ప్రీత్ సింగ్ (1వ నిమిషం) ఓ గోల్ అందించారు.
హాకీలో భారత్ అజేయం- బ్రిటన్‌పై గెలుపు - హాకీలో భారత్ అజేయం- బ్రిటన్‌పై గెలుపు
ఐరోపా పర్యటనలో భాగంగా బ్రిటన్‌తో జరిగిన చివరి మ్యాచ్‌లో భారత్ 3-2 తేడాతో గెలుపొందింది. ఇండియా తరఫున మన్దీప్ సింగ్ రెండు, హర్మన్ ప్రీత్ సింగ్ ఒకటి చొప్పున గోల్స్ సాధించారు.
హాకీలో భారత్ అజేయం- బ్రిటన్‌పై గెలుపు
జేమ్స్ గాల్ (20వ), ఫోర్సిత్ (55వ) బ్రిటన్‌కు గోల్స్ అందించారు. గత మ్యాచ్‌లో భారత్ 1-1తో బ్రిటన్ను నిలువరించింది. అంతకుముందు జర్మనీపై భారత్ 6-1తో ఘనవిజయం సాధించింది. అదే జట్టుతో ఇంకో మ్యాచ్‌ను 1-1తో డ్రా చేసుకుంది.