తెలంగాణ

telangana

ETV Bharat / sports

కాషాయ కండువా కప్పుకున్న స్టార్​ క్రీడాకారులు

ప్రముఖ రెజ్లర్​, ఒలింపిక్​ పతక విజేత యోగేశ్వర్​ దత్​, భారత హాకీ మాజీ కెప్టెన్​ సందీప్​ సింగ్​ భాజపాలో చేరారు. ప్రధాని నరేంద్ర మోదీ పాలనా విధానాలు నచ్చి కాషాయ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారీ ప్రముఖ క్రీడాకారులు. వీరితో పాటు అకాలీదళ్​ ఎమ్మెల్యే బాల్​కౌర్​ సింగ్​ కూడా భాజపాలో చేరారు.

కాషాయ కండువా కప్పుకున్న స్టార్​ క్రీడాకారులు

By

Published : Sep 26, 2019, 7:57 PM IST

Updated : Oct 2, 2019, 3:26 AM IST

హరియాణాలో ఎన్నికల నగారా మోగిన నేపథ్యంలో ఒలింపిక్​ పతక​ విజేత, ప్రముఖ రెజ్లర్​ యోగేశ్వర్​ దత్​, భారత హాకీ మాజీ కెప్టెన్​ సందీప్​ సింగ్​ భాజపాలో చేరారు. వీరితో పాటు అకాలీ దళ్​​ ఎమ్మెల్యే బాల్​కౌర్​ సింగ్ కూడా కాషాయ కండువా కప్పుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ పాలనా విధానాల పట్ల ఆకర్షితులై పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించాడు యోగేశ్వర్​. రాజకీయాల్లో ఉండి ప్రజలకు ఎంతో సేవ చేయవచ్చని మోదీ నిరూపించారని పేర్కొన్నాడు.

క్రీడాకారునిగా సేవలందించిన తాను... ఇప్పుడు రాజకీయాల్లో చేరి దేశానికి సేవ చేసేందుకు కృషి చేస్తానని చెప్పుకొచ్చాడు సందీప్​ సింగ్​.

హరియాణాకు చెందిన రెజ్లర్​... యోగేశ్వర్​ దత్​ 2012 ఒలింపిక్స్​ 60 కేజీల విభాగంలో కాంస్య పతకం సాధించాడు. 2013లో పద్మశ్రీ పురస్కారం వరించింది. 2014 కామన్​వెల్త్​ క్రీడల్లో స్వర్ణం సొంతం చేసుకున్నాడు.

ఈ కుస్తీ వీరుడు త్వరలో జరగనున్న హరియాణా అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచే అవకాశముంది.

సందీప్​ సింగ్​...

2006లో ప్రమాదవశాత్తు తీవ్రంగా గాయపడ్డ భారత హాకీ మాజీ కెప్టెన్ సందీప్‌సింగ్ ఏడాది పాటు వీల్‌చెయిర్‌కే పరిమితమయ్యారు. అనంతరం కోలుకుని 2010 ప్రపంచకప్​లో భారత జట్టుకు ప్రాతినిథ్యం వహించారు. ప్రస్తుతం.. హరియాణా పోలీస్‌శాఖలో డీఎస్​పీ ర్యాంకుతో ఉన్న సింగ్‌ జీవితకథను 'సూర్మా' పేరుతో బాలీవుడ్ సినిమాగా రూపొందించారు.

ఇదీ చూడండి:ఇంజినీరింగ్​ విద్యలో సంస్కృత భాష!

Last Updated : Oct 2, 2019, 3:26 AM IST

ABOUT THE AUTHOR

...view details