కరోనా ప్రభావం మరో టోర్నీపై పడింది. ఝార్ఖండ్‌లో ఏప్రిల్ 3న ప్రారంభం కావాల్సిన 'జాతీయ జూనియర్ హాకీ టోర్నమెంట్' వాయిదా పడింది. అందులో పాల్గొనాల్సిన కొందరు ఆటగాళ్లకు కరోనా పాజిటివ్‌గా తేలడమే ఇందుకు కారణం.
11 మంది ఆటగాళ్లకు కరోనా.. హాకీ టోర్నీ వాయిదా - sports news
త్వరలో జరగాల్సిన జూనియర్ హాకీ టోర్నీ వాయిదా పడింది. ఈ టోర్నీలో పాల్గొనే ఆటగాళ్లకు కరోనా వచ్చినట్లు తేలడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని నిర్వాహకులు అధికారికంగా వెల్లడించారు.
11 మంది ఆటగాళ్లకు కరోనా.. హాకీ టోర్నీ వాయిదా
ఆతిథ్య వేదిక సిమ్దేగాకు వచ్చిన చంఢీగడ్ జట్టు ఆటగాళ్లకు పరీక్షలు చేయగా, అందులో ఐదుగురికి పాజిటివ్‌గా తేలింది. ఝార్ఖండ్ బృందంలోని ఆరుగురు ప్లేయర్లకు కూడా కొవిడ్ సోకినట్లు నిర్ధరణ అయింది. దీంతో వారందరినీ ఐసోలేషన్‌కు పంపి, ముందు జాగ్రత్తగా టోర్నీని వాయిదా వేస్తున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.
Last Updated : Mar 31, 2021, 2:37 PM IST