తెలంగాణ

telangana

ETV Bharat / sports

మలేసియాతో మహిళా హాకీ జట్టు తొలిపోరు నేడే

ఐదు మ్యాచ్​ల సిరీస్​లో భాగంగా నేడు మలేసియాతో తొలిమ్యాచ్​ ఆడనుంది భారత మహిళల హాకీ జట్టు. గోల్​కీపర్​ సవిత సారథ్యంలో ఫేవరెట్​గా బరిలోకి దిగుతోంది టీమిండియా.

మలేసియాతో భారత మహిళల హాకీ జట్టు మ్యాచ్​లు

By

Published : Apr 4, 2019, 5:24 AM IST

ఇటీవల స్పెయిన్​ సిరీస్​లో అద్భుత ప్రదర్శన చేసిన భారత మహిళలహాకీ జట్టు... మరోసారి అదే ఆటతీరును ప్రదర్శించేందుకు సిద్ధమైంది. మలేసియా వేదికగా అతిథ్య జట్టుతో అయిదు మ్యాచ్​ల సిరీస్​ ఆడనుంది. నేడు ఇరు జట్ల మధ్య తొలి మ్యాచ్​ జరగనుంది.

ఐదు మ్యాచ్​ల సిరీస్​కు సిద్ధం
  • 2018 ప్రపంచ కప్​ కాంస్య పతక విజేత స్పెయిన్​పై ఒక విజయం, ఒక ఓటమి, రెండు డ్రా మ్యాచ్​లతో సిరీస్​ను డ్రాగా ముగించింది భారత మహిళల హాకీజట్టు.

గతేడాది వరల్డ్​ కప్​ రన్నర్స్​గా నిలిచిన ఐర్లాండ్​ను ఓ మ్యాచ్​లో ఓడించి, మరో మ్యాచ్​ డ్రా చేసుకుంది.

భారత మహిళల హాకీ జట్టు

'నిలకడగా రాణించడం అంత సులభం కాదు. చాలా క్రమశిక్షణ కలిగి బాధ్యతతో ఆడినపుడు మాత్రమే సాధ్యమవుతుంది. జట్టును అన్ని విభాగాల్లో పటిష్ఠం చేస్తున్నాం.'
-- మరిజ్నే ​, భారత మహిళా జట్టు హాకీ శిక్షకురాలు

2017 ఆసియా కప్​లో మలేసియాతో పోటీపడిన భారత్​ 2-0తో గెలిచింది. అయితే టైటిల్​ పోరులో చైనా చేతిలో ఓడిపోయింది.

ABOUT THE AUTHOR

...view details