తెలంగాణ

telangana

ETV Bharat / sports

టైటిల్​ పోరులో భారత హాకీ జట్టు షూట్​ 'ఔట్​' - భారత హాకీ జట్టు

అజ్లాన్​ షా హాకీ టైటిల్​ సాధించాలన్న భారత్​కు ఈ ఏడాది నిరాశే ఎదురైంది. దక్షిణ కొరియాతో శనివారం జరిగిన ఫైనల్లో ఓడిపోయి రన్నరప్​తో సరిపెట్టుకుంది.

టైటిల్​ పోరులో భారత హాకీ జట్టు షూట్​ 'ఔట్​'

By

Published : Mar 31, 2019, 1:58 PM IST

నాలుగోసారి అజ్లాన్​ షా హాకీ ఛాంపియన్​ కప్​ కొడదామన్న భారత హాకీ జట్టుకు ఈ ఏడాది జరిగిన టోర్నీలో చుక్కెదురైంది. ఓడిపోకుండా చివరి వరకు వెళ్లిన భారత జట్టుకు దక్షిణ కొరియా షాకిచ్చింది. షూటౌట్​లో 4-2 తేడాతో విజయం సాధించిన కొరియన్ జట్టు కప్పు ఎగరేసుకుపోయింది.

రన్నరప్​గా నిలిచిన భారత జట్టు
  • సిమ్రాన్‌జీత్‌ సింగ్‌ 9వ నిమిషంలో చేసిన గోల్‌తో ఆధిక్యంలోకి వెళ్లిన భారత్​.... ఢిపెన్స్​తో అదరగొట్టింది. 13 నిమిషాల్లో​ మ్యాచ్​ ముగుస్తుందనే సమయానికి ప్రత్యర్థికి పెనాల్టీ ఇచ్చింది.

పెనాల్టీ గోల్​...

పెనాల్టీ అవకాశాన్ని అందిపుచ్చుకున్న దక్షిణ కొరియా ఆటగాడు జంగ్​ జోంగ్​... గోల్​ కొట్టాడు. స్కోరు 1-1తో సమమైంది. అనంతరం షూటౌట్‌ నిర్వహించారు.

డ్రా అయిన దక్షిణ కొరియా, భారత మధ్య మ్యాచ్​

కొంపముంచిన షూటౌట్...

షూటౌట్​తో తొలుత ఆడిన భారత ఆటగాళ్లు... ఐదు అవకాశాల్లో రెండు గోల్స్‌ మాత్రమే చేశారు. ప్రత్యర్థి జట్టు దక్షిణ కొరియా నాలుగు గోల్స్​ కొట్టి టైటిల్​ ఎగరేసుకుపోయింది.

ABOUT THE AUTHOR

...view details